అచ్చ్చపు జీకటిం బడి గృహవ్రతులై విషయప్రవిష్టులై

24 Nov

అచ్చ్చపు జీకటిం బడి గృహవ్రతులై విషయప్రవిష్టులై

చచ్చుచు బుట్టుచున్ మఱల జర్విత చర్వణులైన వారికిన్

జెచ్చెర బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్చనైన నే 

మిచ్చిననైన గానలకునేగిననైన హరిప్రబోధముల్

 

సంసారం లో ఉంటూ సంసారము మరియు సంసార విషయాల తో మాత్రమే తాదాత్మ్యత చెందుతూ నిరంతరము వాటినే మనస్సు లో తలచే వ్యక్తులకు భక్తి, మోక్షము వంటి వాటిల  యందు ఆసక్తి కలుగుట కష్టము అని చెప్పే పద్యం ఇది.    

గాడాంధకారములో పడి గృహవ్యవహారములచే చుట్టబడి, విషయ భోగములలో మునిగినవారై చచ్చుచు ,పుట్టుచు మఱల మఱల చచ్చుచు ,పుట్టుచు ఉండే వారికి,శ్రిహరి ని గూర్చి తెలుసుకోవాలి అనే కోరిక పుట్టుట కూడా కష్టమే. వారికి ఇతరులు చెప్పినా,స్వతహాగా ఐనా ,మీరు యేమి తీసుకువచ్చి ఇచ్చినా, చివరకు సమస్తాన్నీ త్యజించి అడవులకు వెళ్ళిపోయినా కూడా అంత సులభంగా చిత్తము (మనస్సు) శ్రీహరి వద్దకు వెళుతుందా ? అంటూ చెబుతాడు ప్రహ్లాదుడు .

 ఈ పద్యం పోతనామాత్యుల  శ్రీమదాంధ్రమహాభాగవతం లో ప్రహ్లాద చరిత్రం  లోనిది.

acchchapu jeekaTim baDi gRhavratulai vishayapravishTulai

chachchuchu buTTuchun ma~rala jarvita charvaNulaina vaarikin

jechchera buTTunE parulu seppinanaina nijEchchanaina nE 

michchinanaina gaanalakunEginanaina hariprabOdhamul

 

samsaara lO unToo samsaaramu mariyu samsaara vishayaala tO maatramE taadaatmyata chendutoo nirantaramu vaaTinE manassu lO talachE vyaktulaku bhakti, mOkshamu vanTi vaaTila  yandu aasakti kaluguTa kashTamu ani cheppE padyam idi. 

 

gaaDaandhakaaramulO paDi gRhavyavahaaramulachE chuTTabaDi, vishaya bhOgamulalO muniginavaarai chachchuchu ,puTTuchu ma~rala ma~rala chachchuchu ,puTTuchu unDE vaariki,Srihari ni goorchi telusukOvaali anE kOrika puTTuTa kooDaa kashTamE. vaariki itarulu cheppinaaa,swatahaagaa ainaa ,meeru yEmi teesukuvachchi ichchinaa, chivaraku samastaannI tyajinchi aDavulaku veLLipOyinaa kooDaa anta sulabhangaa chittamu (manassu) SrIhari vaddaku veLutundaaa ? anToo chebutaaDu prahlaaduDu .

 

ee padyam pOtanaamaatyula  Sreemadaandhramahaabhaagavatam lO prahlaada charitram  lOnidi. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: