శివ దండకం

29 Nov

 శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థానసంహారకారీ పురారీ మురారి ప్రియా

చంద్రధారీ మహేంద్రాది బృందారకానందసందోహసంధాయి పుణ్యస్వరూపా

విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైవ తత్త్వంబు భేదించి

బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వ

క్రియాకారణం బంచు నానాప్రకారంబుల్ బుద్ధిమంతుల్ విచారించుచున్

నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా  భవానీపతీ

నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని

సోమార్కతోయంబులం జేసి కావించి సంసారచక్ర క్రియాయంత్రవాహుండవై

తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంతయోగస్థితిన్  నిర్మలజ్ఞానదీప

ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ

రాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన

పీయూష ధారానుభూతిన్  సదాతృప్తులై నిత్యులై రవ్య యాభవ్య సేవ్యాభవా

భర్గ భట్టారకా భార్గవాగస్త్యకుత్సాది

నానామునిస్తోత్రదత్తావధానా

లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా నీ

ప్రసాదంబున్ సర్వగీర్వాణగంధర్వులున్

సిద్ధసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్

శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు

నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా

నమస్తే నమస్తే నమః.

ఇది భారతం లో అర్జనుడు శివుని పై చేసిన స్తోత్రం.నన్నయ్య గారి కలం లో నుండి ఇది ఇలా శివ దండకం గా జాలువారింది .

Incase our browser does not support telugu font please check the same here in English , then copy it to telugu using lekhini.org 

                            Siva danDakam

SrIkaMTha lOkESa lOkOdbhavasthAnasaMhArakArI purArI murAri priyA

chaMdradhArI mahEMdrAdi bRMdArakAnaMdasaMdOhasaMdhAyi puNyasvarUpA

virUpAksha dakshAdhvaradhvaMsakA dEva nIdaiva tattvaMbu bhEdiMchi

buddhiM bradhAnaMbu garmaMbu vij~nAna madhyAtmayOgaMbu sarva

kriyAkAraNaM baMchu nAnAprakAraMbula@n buddhimaMtul^ vichAriMchuchun

ninnu bhAviMtu rISAna sarvESvarA Sarva sarvaj~na sarvAtmakA nirvikalpa prabhAvA  bhavAnIpatI

nIvu lOkatrayIvartanaMbun mahIvAyukhAtmAgni

sOmArkatOyaMbulaM jEsi kAviMchi saMsArachakra kriyAyaMtravAhuMDavai

tAdidEvA mahAdEva nityaMbu natyaMtayOgasthitin  nirmalaj~nAnadIpa

prabhAjAla vidhvasta nissAra saMsAra mAyAMdhakArul^ jitakrOdha

rAgAdidOshul^ yatAtmul^ yatIMdrul^ bhavatpAda paMkEruhadhyAna

pIyUsha dhArAnubhUtin  sadAtRptulai nityulai ravya yAbhavya sEvyAbhavA

bharga bhaTTArakA bhArgavAgastyakutsAdi

nAnAmunistOtradattAvadhAnA

lalATEkshaNOgrAgnibhasmIkRtAnaMga bhasmAnuliptAMga gaMgAdharA nI

prasAdaMbuna@n sarvagIrvANagaMdharvulun

siddhasAdhyOragEMdrA surEMdrAdulun

SASvataiSvarya saMprAptulai rISvarA viSvakartA surAbhyarchitA nAku

nabhyarthitaMbul^ prasAdiMpu kAruNyamUrtI trilOkaikanAthA

namastE namastE nama@h.

idi bhaaratam lO arjanuDu Sivuni pai chEsina stOtram.nannayya gaari kalam lO nunDi idi ilaa Siva danDakam gaa jaaluvaarindi .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: