మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!

1 Dec

మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే!
భృత్యః కుప్యతి నా2నుగచ్ఛతి సుతాః కాంతాపి నాలింగ్యతే!
అర్థప్రార్థనశంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్!
తస్మాత్ నైతిక అర్థ మార్జయ శ్రుణు సఖే హ్య2ర్థేన సర్వే వశాః!!
      

           చాలా మందికి ఒక అపోహ ఉంటుంది,మన శాస్త్రాలలో ధనసముపార్జన వద్దని చెప్పారు అని.కాని అది కేవలం ఒక అపోహ మాత్రమే.మన పెద్దవాళ్ళు ధన సముపార్జన వద్దనలేదు , కాని ధనము యందు మాత్రమే  తృష్ణ పెట్టుకొని మిగతా అన్నిటిని వదిలేయటం లాంటి పనులు చెయ్యొద్దు అని మాత్రమే చెప్పారు.సంపాదించే ధనం ధర్మబధ్దమైన మార్గం లో మాత్రమే సంపాదించాలి.అలాగే జీవితం లొ ధనమే పరమార్ధం అని అనుకోకూడదు.

    ధనసముపార్జన లేని వ్యక్తి కి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో చెప్పే శ్లోకం ఇది.
  
    మాతా నిందతి అని ప్రారంభిచడం లొనే , ధన సముపార్జన యొక్క ఆవశ్యకత ని చూపుతున్నారు,సహజం గా తల్లి తన పిల్లలని నిందించదు,కానీ ఒక వయస్సు వచ్చిన తరువాత సంపాదన లేకపోతే ఆ తల్లి కూడా  “ఏమిటో బొత్తిగా సంపాదన లేకుండా ఉన్నాడు అని అంటుంది”.అలాగే నలుగురి లో మా అబ్బాయి అని చెప్పుకుని మురిసిపొయే తండ్రి సంపాదన లేని కారణానికి మెచ్చుకోడు.ఇహ సహోదరుల విషయానికి వస్తే, ధనం సంపాదించని సోదరునితో మిగతా అన్నదమ్ములు మట్లాడరు,చిన్న చూపు చూస్తారు.
     సరే పోని ఇంట్లొ ఉన్న ఏ పనివారినో, ఏమోయి కాస్త ఆ నీళ్ళు ఇటు పెట్టు అన్నారనుకోండి ఇహ వాళ్ళకి కూడా కోపం వస్తుంది, “రూపాయి ఇవ్వరు గాని” అంటూ సణుగుతారు ,ఒక్కోసారి మొహం మీద కూడా అంటారు.భ్రుత్యహ్ కుప్యతి అంటే ఇదే.”నానుగచ్చతి సుతా” కొదుకు కూడా మాట వినడు,ఊరుకోండి నాన్నగారు మీకెమీ తెలియదు అసలు అని అస్సలు మాట లక్ష్య పెట్టకుండా ఉంటాదు.”కాంతాపి నాలింగతే” కట్టుకున్న భార్య ప్రియమార కౌగలించుకోదు;దగ్గరకు చేరదు.

     “అర్ధ ప్రార్ధన శంకయా నకురుతే సల్లాప మాత్రం సుహృత్”అసలు అన్నిటి కంటే కష్టమైనది, బాధపెట్టేది ఇదే,ఏ బంధం సంబధం లేకుండా ఏర్పడేది స్నేహ బంధం ఒక్కటే,అలాంటి మిత్రుడు,వీడికి కనబడితే ఎక్కడ ఓ వంద రూపాయలు సర్దమంటాడో అనే భయం తో తప్పించుకు తిరుగుతాడు, ఒకవేళ ఎదురుబడ్డా సరిగా మాట్లాడడు.
     ఇదంతా చెప్పాం కదా అని ఎలా పెడితే అలా  సంపాదిస్తాడేమో అని మన పెద్దలు ఇక్కడ మనకి మళ్ళీ ఒక కట్టు వేసారు,అందుకే ఇంత వరకు చెప్పి ఒక మాటన్నారు,”తస్మాత్ నైతిక మర్ధ మార్జన సఖే” అని ,ఓ మిత్రమా నైతికమైన ( నీతివంతమైన) రీతిలో ధనార్జన చెయ్యవోయి అప్పుడు నీకన్ని వశమౌతాయోయ్ అని, చూడండి ఎక్కడ మొదలు పెట్టినా ఎన్ని విషయాలు చెప్పినా, మళ్ళీ అన్నిటినీ ధర్మం తో ముడివేయడమే సనాతన ధర్మం యొక్క విశిష్ఠత.ధనార్జన చెయ్యు కాని నీతివంతమైన మార్గం లో మాత్రమే చెయ్యు లేకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అని మన పెద్దలు మనకి నీతిని బోధ చేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: