శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్

4 Dec

శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు గేళిలోలవిలసదృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనా ఢింభకున్.
 
శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించి పోతనామాత్యులు ఏమి కోరుకున్నారు ? అసలు ఆయన శ్రీమద్భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరించారు ?
 
పోతనామాత్యులు  వారే ఈ ప్రశ్నలకు సమాధనం చెప్పారా అనిపిస్తుంది ఈ పద్యం చదువుతూంటే.ఆయన శ్రీమద్భాగవతాన్ని ప్రారంభిస్తూనే ప్రప్రధమం గా శ్రీకృష్ణభగవానుని ప్రార్ధన చేస్తూ “శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్” అంటూ ప్రారంభం చేసారు.అసలు మానవ జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం,ఈ శరీరాన్ని మనం ఒక పనిముట్టు గా వాడుకొని ,భగవత్ ధ్యానం చేసి,పునరావ్రుత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యాన్న్ని(ముక్తిని) పొందడమే!దీనినే పోతనామాత్యులు “శ్రీ కైవల్య పదంబు” అని అన్నారు.
 
పైనుండి చదువుకుంటే పోతనామత్యులు ఈ గ్రంథ రచన ద్వారా “శ్రీ కైవల్య పదాన్ని” కోరుకున్నారు అనే అర్ధం వచ్చినా “శ్రీ కైవల్య పదంబు” అంటూ ప్రారంభించడం లొనే ,అదే ఈ గ్రంథ ప్రయోజనం అని మనం తెలుసుకోవాలి.ఈ గ్రంథాన్ని చదువుకునే వారెవరైనా కోరుకోవలసినది ఇదేనని సూచన చేస్తున్నారా పోతనామత్యులు అనిపిస్తుంది.
 
సరే ఇక ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం
 
శ్రీ కైవల్య పదము పొందుట కొరకు నేను లోకరక్షాపరాయణుడు ,భక్తపాలనమే ఒక కళగా ఆచరించేవాడు,దానవుల యొక్క ఉద్ధృత,వికృత క్రియాకలాపములను అరికట్టేవాడు,లీలావలోకనమాత్రము చేత భువన ,గగన, బ్రహ్మాండాలను  సృజించిన వాడు ,నంద మహారాజు గారి యొక్క ఇల్లాలి  ముద్దులబిడ్డడైన చిన్నారి శ్రీకృష్ణుని (బాలకృష్ణుని) ధ్యానిస్తున్నాను.

incase you are not able to see Telugu properly on your browser , open lekhini.org  and  copy the following content in the space provided for translation on that site.

SrI kaivalyapadambu jEruTakunai chintinchedan lOkara
kshaikaarambhaku bhaktapaalanakaLaasaMrambhakun daanavO
drEkastambhaku gELilOlavilasadRgjaalasambhootanaa
naakanjaatabhavaanDakumbhaku mahaanandaanganaa Dhimbhakun.
 
SrImadbhaagavataanni aandhreekarinchi pOtanaamaatyulu Emi kOrukunnaaru ? asalu aayana SrImadbhaagavataanni enduku aandhreekarinchaaru ?
 
pOtanaamaatyulu  vaarE ee praSnalaku samaadhanam cheppaaraa anipistundi ee padyam chaduvutoonTE.aayana SrImadbhaagavataanni praarambhistoonE prapradhamam gaa SrIkRshNabhagavaanuni praardhana chEstoo “SrI kaivalya padambu jEruTakunai chintinchedan” anToo praarambham chEsaaru.asalu maanava janma yokka pradhaana prayOjanam,ee Sareeraanni manam oka panimuTTu gaa vaaDukoni ,bhagavat dhyaanam chEsi,punaraavrutti rahita SaaSvata Siva saayujyaannni(muktini) pondaDamE!deeninE pOtanaamaatyulu “SrI kaivalya padambu” ani annaaru.
 
painunDi chaduvukunTE pOtanaamatyulu ee grantha rachana dwaaraa “SrI kaivalya padaanni” kOrukunnaaru anE ardham vachchinaa “SrI kaivalya padambu” anToo praarambhinchaDam lonE ,adE ee grantha prayOjanam ani manam telusukOvaali.ee granthaanni chaduvukunE vaarevarainaa kOrukOvalasinadi idEnani soochana chEstunnaaraa pOtanaamatyulu anipistundi.
 
sarE ika ee padyam yokka bhaavaanni chooddaam
 
SrI kaivalya padamu ponduTa koraku nEnu lOkarakshaaparaayaNuDu ,bhaktapaalanamE oka kaLagaa aacharinchEvaaDu,daanavula yokka uddhRta,vikRta kriyaakalaapamulanu arikaTTEvaaDu,leelaavalOkanamaatramu chEta bhuvana ,gagana, brahmAnDaalanu  sRjinchina vaaDu ,nanda mahaaraaju gaari yokka illaali  muddulabiDDaDaina chinnaari SrIkRshNuni (baalakRshNuni) dhyaanistunnaanu.

4 Responses to “శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్”

 1. Sreekanth June 26, 2011 at 1:06 am #

  Great articles!! Thank you very much!! I am looking for Sri Pothana Bhagavatam for a while. So far I have only found few well known collections. Any pointers to where I can find the complete telugu version?

  Thanks,
  Sreekanth

 2. Subramanyam K.V. June 28, 2011 at 12:44 pm #

  Hi Sreekanth
  thanks for the comment .
  Well putting entie pothana bhagavatam online is one of my dreams , but i am still stuck in prathama skandham it self, currently I am working on putting the manachi slokams online, I will get back to bhagavatam once I am done with that.

  There are some sites which have entire bhagavatam ,but they have only the padya bhagam if I am correct, I lost the link sometime ago. will share that with you once I have it
  Regards
  Subbu

 3. గణనాధ్యాయి February 13, 2016 at 7:41 am #

  ధన్యవాదాలండి శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం గార్లకు యాదృచ్చికంగా ఇప్పుడే ఈ పుటను చూసాను. మన తెలుగుభాగవతం.ఆర్గ్ ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఇంకా ఆసక్తి ఉంటే దయచేసి సంప్రదించగలరు.
  – భాగవత గణనాధ్యాయి, telugubhagavatam.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: