వాలినభక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్

5 Dec

వాలినభక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్
బాలశశాంకమౌళికి గపాలికి మన్మధగర్వపర్వతో
న్మూలికి నారదాదిమునిముఖ్యమనస్సరసీరుహాళికిన్
 
పోతనామాత్యులు శివ-కేశవ బేధములను చూచెడివారు కారు, వారి దృష్టికోణం లో శివ-కేశవులు ఒక్కటే,అందుకే శ్రీకైవల్య పదంబు అంటూ శ్రీకృష్ణ స్తుతి తో ప్రారంభించిన వారు రెండవ పద్యం లో తొమ్మిది “లి” కారాలతో లింగస్వరూపం స్ఫురించేటట్టు ఈ పద్యాన్ని చేసారు.
 
వాలిన భక్తి అంటూ ఈ పద్యం ప్రారంభించ బడినది, భక్తి వాలుతుందా ఎక్కడైనా? మరి వాలినభక్తి అని పోతనామాత్యులు ప్రారంభించడం వెనుక అర్ధం ఎమిటి?
 
మనం సాష్టాంగ ప్రణామం చేసే టప్పుడు మనం పూర్తిగా భూమిపై పడి నమస్కారం  చేస్తాం ,వాలిన భక్తి అండం లో పోతనామాత్యుల వారి భావన బహుశా ఇదే అయి ఉండవచ్చు .
 
సరే ఇప్పుడు పద్యం యొక్క భావాన్ని చూద్దాం.
 
లీలాతాండవలోలుడు,దయాఘనుడు,చేతిలో త్రిశూలము ధరించినవాడు,పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవియొక్క ముఖారవిందాన్ని ప్రఫుల్లం చేసే ప్రభాకరుడు,శిరస్సున నెలవంకను,మెడలో కపాలములు ధరించి నారదాది మునిసత్తముల చిత్తములలో విహరించే ఆ మధుకరునికి, ఆ కందర్పదర్పహరునికి నా శిరస్సు వంచి ,సాష్టాంగముగా  భక్తి తో ప్రణమిల్లుతున్నాను.

Incase you are not able to view telugu properly . please copy paste the following content in Lekhini.org and you can read this .

vaalinabhakti mrokkeda navaarita taanDavakELikin dayaa

Saaliki Soolikin Sikharijaamukhapadmamayookhamaalikin

baalaSaSaankamouLiki gapaaliki manmadhagarvaparvatO

nmooliki naaradaadimunimukhyamanassaraseeruhaaLikin

pOtanaamaatyulu Siva-kESava bEdhamulanu choocheDivaaru kaaru, vaari dRshTikONam lO Siva-kESavulu okkaTE,andukE SrIkaivalya padambu anToo SrIkRshNa stuti tO praarambhinchina vaaru renDava padyam lO tommidi “li” kaaraalatO lingaswaroopam sphurinchETaTTu ee padyaanni chEsaaru.

vaalina bhakti anToo ee padyam praarambhincha baDinadi, bhakti vaalutundaa ekkaDainaa? mari vaalinabhakti ani pOtanaamaatyulu praarambhinchaDam venuka ardHam emiTi?

manam saashTaanga praNaamam chEsE TappuDu manam poortigaa bhoomipai paDi namaskaaram  chEstaam ,vaalina bhakti anDam lO pOtanaamaatyula vaari bhaavana bahuSaa idE ayi unDavachchu .

sarE ippuDu padyam yokka bhaavaanni chooddaam.

leelaataanDavalOluDu,dayaaghanuDu,chEtilO triSoolamu dharinchinavaaDu,parvataraaja putrika ayina paarvatIdEviyokka mukhaaravindaanni praphullam chEsE prabhaakaruDu,Sirassuna nelavankanu,meDalO kapaalamulu dharinchi naaradaadi munisattamula chittamulalO viharinchE aa madhukaruniki, aa kandarpadarpaharuniki naa Sirassu vanchi ,saashTaangamugaa  bhakti tO praNamillutunnaanu.

One Response to “వాలినభక్తి మ్రొక్కెద నవారిత తాండవకేళికిన్”

  1. Pranav April 24, 2014 at 11:05 pm #

    Thanks for sharing this!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: