లలితమర్యాదుడైన ప్రహ్లాదుడధిప

13 Jan

సీ.    తనయందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు
        పెద్దల బొడగన్న భృత్యునికైవడి  చేరి నమస్కృతుల్  సేయువాడు
        కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన  మాతృభావన సేసి మరలువాడు 
        తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులగావ జింతించువాడు 
 
ఆ.    సములయెడ సోదరస్థితి జరుపువాడు
        దైవతములంచు గురువులదలచువాడు
        లీలలందును బొంకులు లేనివాడు
        లలితమర్యాదుడైన ప్రహ్లాదుడధిప  

ప్రహ్లాదుని గుణములను చెప్పే పద్యం ఇది.

తనని తాను ఎలా చూస్తాడో ,తన గురించి తాను ఎలా భావన చేస్తాడో  సమస్తప్రాణులను కూడా అదే భావన తో చూసే లక్షణమును  (సమహితత్వమును)  కలిగియున్నవాడు ,పెద్దలు కనబడగానే భృత్యుని (సేవకుని) వలె నమస్కారము చేసే వాడు,తన కంటికి ఇతర స్త్రీలు కనబడగానే మాతృభావన చేసి పక్కకు వెళ్ళేవాడు .ఇక్కడ పోతన గారు వాడిన పదములను గమనించాలి , ఆయన ప్రహ్లాదుడు అన్యస్త్రీలను చూస్తే అని అనలేదు, అన్యస్త్రీలు ప్రహ్లాదుని కంటి కి (కంటి చూపుకి) అడ్డమైతే అన్నారు అంటే తనగా తాను అటువంటి తావులకు పోడు ఒక్కోసారి ఏదైన అవసరము ఉండి వారే ఎదురైతే  మాతృభావన  చేసి మరలిపోయేవాడు .దీనులను తల్లితండ్రుల వలె కంటికి రెప్పలా ,వాత్సల్యము తో చూచెడి వాడు. తనతో సమవయస్కులైన వారిని స్నేహితులను సోదరులవలే చూచువాడు .గురువులను ప్రత్యక్ష దైవముగా జూచెడివాడు ,పరిహాసమునకైనా కూడా అసత్యమును పలుకని వాడు.
 
భాగవతం లో ప్రహ్లాదుని గుణగణముల గురించి ఈ విధముగా చెప్పబడినది.

Incase you are not able to see telugu on your browser please copy paste  the following text in lekhini.org . you can convert this text to telugu easily.

see.  tanayandu nakhila bhootamulandu noka bhangi samahitatvambuna jaruguvaaDu
        peddala boDaganna bhRtyunikaivaDi  chEri namaskRtul  sEyuvaaDu
        kannudOyiki nanyakaantalaDDambaina  maatRbhaavana sEsi maraluvaaDu 
        tallidanDrulabhangi dharmavatsalatanu deenulagaava jintinchuvaaDu 
 
aa.   samulayeDa sOdarasthiti jarupuvaaDu
        daivatamulanchu guruvuladalachuvaaDu
        leelalandunu bonkulu lEnivaaDu
        lalitamaryaaduDaina prahlaaduDadhipa
 
prahlaaduni guNamulanu cheppE padyam idi.
tanani taanu elaa choostaaDO ,tana gurinchi taanu elaa bhaavana chEstaaDO  samastapraaNulanu kooDaa adE bhaavana tO choosE lakshaNamunu  (samahitatvamunu)  kaligiyunnavaaDu ,peddalu kanabaDagaanE bhRtyuni (sEvakuni) vale namaskaaramu chEsE vaaDu,tana kanTiki itara streelu kanabaDagaanE maatRbhaavana chEsi pakkaku veLLEvaaDu .ikkaDa pOtana gaaru vaaDina padamulanu gamaninchaali , aayana prahlaaduDu anyastreelanu choostE ani analEdu, anyastreelu prahlaaduni kanTi ki (kanTi choopuki) aDDamaitE annaaru anTE tanagaa taanu aTuvanTi taavulaku pODu okkOsaari Edaina avasaramu unDi vaarE eduraitE  maatRbhaavana  chEsi maralipOyEvaaDu .deenulanu tallitanDrula vale kanTiki reppalaa ,vaatsalyamu tO choocheDi vaaDu. tanatO samavayaskulaina vaarini snEhitulanu sOdarulavalE choochuvaaDu .guruvulanu pratyaksha daivamugaa joocheDivaaDu ,parihaasamunakainaa kooDaa asatyamunu palukani vaaDu.
 
bhaagavatam lO prahlaaduni guNagaNamula gurinchi ee vidhamugaa cheppabaDinadi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: