మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము

28 Feb

మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్

 జచ్చుచునుండజూచెదరు చావకమానెడువారిభంగి నీ

 చచ్చినవారి కేడ్చెదరు చావున కొల్లకడాగవచ్చునే?

 యెచ్చటబుట్టె నచ్చటికి నేగుటనైజము ప్రాణికోటికిన్

        హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు హిరణ్యకశిపుడు తల్లిని ఊరడిస్తూ చెప్పే పద్యం ఇది.తల్లిని ఓదార్చడానికి హిరణ్యకశిపుడు ఉశీనరదేశపు రాజు యొక్క వృత్తాంతమును చెప్తాడు.ఉశీనరదేశపు రాజు మరణించిన పిమ్మట అతని భార్యలు శవమును అంత్యేష్టి సంస్కారమునకు ఈయకుండా ,అతని పార్థివ శరీరమును పట్టి  శొకించుచున్నప్పుడు ,యముడు ఒక బ్రాహ్మణ బాలకుని వలే వచ్చి వారికి ఇలా బోధించెను.

          అజ్ఞానాంధకారము లో నుండి ,వెర్రి వ్యామోహం పెంచుకొని ఇలా దుఃఖించడం తగదు ,అదేం చోద్యమో కానీ ప్రాణుల  ప్రవర్తన చాలా చిత్రంగా ఉంటుంది ,దేహం ధరించిన ప్రతీ వ్యక్తి మరణించక తప్పదు. ఇది అందరికీ తెలుసు, అంతే కాక నిత్యమూ ప్రాణులు పుట్టుట గిట్టుట మనం చూస్తూనే ఉంటాము ,అసలు పుట్టిన తరువాత గిట్టని దేహము ఎక్కడైనా ఉంటుందా అంటే ఉండదు,ఇవన్నీ చూస్తూ ,వీటన్నిటి మధ్యన ఉంటూ మీరు చావని వారి వలె చనిపోయిన వారి కొరకు మీరు ఎందుకు దుఃఖించుచున్నారు?మృత్యువును తప్పించుకొనుట ఎటువంటి వ్యక్తి కైననూ సాధ్యం కాదు.ప్రాణులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి చేరడం ఎంతో సహజమైన విషయము.

బొధ తో రాణులు కొంత ఉపశమనము పొందిరి

 ఇంత గొప్ప విషయం చెప్పి తల్లిని ఊరడించిన హిరణ్యకశిపుడు తరువాత తనకి చావు రాకూడదని ఎంతో తపస్సు చేసి గాలిం గుంభిని అంటూ వరాలు అడగడం విడ్డూరం కాక మరేమిటి.      

  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: