శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

3 Apr

మిత్రులందరికీ     శ్రీ ఖర   నామ  సంవత్సర   ఉగాది    శుభాకాంక్షలు. ఈ  నూతన  సంవత్సరం లో  కష్టసుఖములను   సమానంగా  స్వీకరించ గలిగే   శక్తి ని , ఆయురారోగ్య  ఐశ్వర్యాభివృద్ధిని  అనుగ్రహించాలని ఆ పరమేశ్వరుని  మనసా  ప్రార్థిస్తున్నాను.

ఉగాది ,వింధ్యాచలము  నుండి  వేంకటాచలం  మధ్య  నివసించే   ప్రజలకు  నూతన  సంవత్సరం   ప్రారంభం అయ్యే   రోజు.   ఈ  వింధ్యాచలం  వేంకటాచలం గొడవ ఏంటి మహప్రభో  అని అనుకోకండి , మన దేశం లో  వింధ్య పర్వతాలకు  ఉత్తరాదిన  ఉండే  ప్రజలు  బృహస్పతి  మానాన్ని  పాటిస్తారు ,అంటే సంవత్సర  కాలాన్ని వారు బృహస్పతి గ్రహము (గురు  గ్రహం ,అంగ్లం  లో  ఐతే  జ్యూపిటర్ అంటాం) యొక్క కదలిక ద్వారా గణిస్తారు . వింధ్య పర్వతానికి దక్షిణము గా వేంకటాచలము (తిరుపతి )నకు   ఉత్తరముగా  ఉండే   వారు (అంటే  మరాఠీ లు,కన్నడిగులు ,తెలుగువారు ) చాంద్రమానాన్ని (కాలమును  గణించడానికి  చంద్రుని  కదలికలను)  ప్రమాణం గా  తీసుకుంటారు.ఇహ తిరుపతి  కి   దక్షిణాన  ఉండే తమిళ  మళయాళ   ప్రజలు  సౌర మానాన్ని (సూర్యుని కదలికల ను ) ప్రమాణం గా తీసుకుంటారు.

ఉగాది  చాంద్రమానం  ఆధారం  గా వచ్చే   పండగ  అని  వేరే  చెప్పక్కరలేదనుకుంటాను  , మనతో   పాటు   కన్నడిగులు   దీనిని  ఉగాది  గానే  జరుపుకుంటే  , మరాఠీలు  దీనిని  గుడి పడ్వా    గా జరుపుకుంటారు  .

శిశిర  శీతల తరంగాలకు  సెలవు  చెప్తూ   వాసంత సమీరాలను స్వాగతించే  మన  ఉగాది   ప్రకృతి  లో  ఎన్నో మార్పులకు  శ్రీకారం చుడుతుంది, చెట్లన్నీ కొత్త  ఆకులతో , నిండైన   కంటికింపైన  పూతతో   దర్శనమిస్తాయి .ఇహ  కోయిలలైతే తమ గాన మాధుర్యం తో చెవులలో అమృతం పోస్తాయి.శీతాకాలం మన జీవితం లో  చలినీ, స్తబ్దతనీ,  తీసుకు వెళిపోతే , చైత్రం మన జీవితానికి నవ వసంతాన్ని కానుకగా తీసుకు వచ్చి  మన తలుపు తడుతుంది .సందట్లో సడే   మియా లా ఇహ  మామిడి పళ్ళ  సమయం  కూడా  ప్రారంభమవుతుంది  .అసలీ ఉగాది రోజునే  బ్రహ్మ దేవులు  సృష్టి  రచనను  ప్రారంభించారనీ  కావున ఉగాది —యుగాది అనీ, కావుననే ఈ రోజున ప్రకృతి లో  ఇన్ని మార్పులు వస్తాయనీ చెప్తారు.

ఇవాళ్టి రోజున  ఉగాది ఒక వేడుక గా మారిపోయింది ,  అంటే ఉగాది నాడు సంతోషం గా ఉండకూదని నా ఉద్దేశ్యం కాదు మహప్రభో , ఉగాదిని కేవలం  వేడుక గా మాత్రం చూడొద్దు అనే చెప్తున్నా . మనం (ముఖ్యం గా యువత)జనవరి 1 న   ఆంగ్లసంవత్సరాదికి  ఇచ్చే ప్రాముఖ్యతలో  పదవ  శాతమైనా  ఉగాది కి ఇవ్వటం  లేదు . ఈ  పరిస్థితి  మారాలి .ఉగాది నాడు మనం ఏం  ఏం చేయాలో పెద్దలు నిర్వచించారు .పొద్దుటే   లేవడం, అభ్యంగన స్నానం చేయటం, ఇష్ట దైవం వద్ద  దీపారాధన చేయడం,  కుదిరితే  దేవాలయానికి  వెళ్ళి  దైవ  దర్శనం చేయడం, ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకులతో తోరణం  కట్టుకోవడం ,  తల్లి దండ్రులకు, పెద్దలైన వారికి, గురువులకు  పాదాభివందనం చేసి వరి ఆశీస్సులను పొందడం(విషెస్ చెప్పే విష సంస్క్రుతి వద్దు, పెద్దలకు నమస్కరించడమే మన సాంప్రదాయం)  , జీవన  యానం లో  వచ్చే వివిధ అనుభవములకు ప్రతీక  గా నిలిచే ఉగాది పచ్చడి  నే మొదటి ఆహారం గా తీసుకోవడం , పంచాంగ  శ్రవణం చేయడం  వీటిలో అతి ముఖ్యమైనవి .

ఇది తెలుగు పండుగ  తెలుగు లోగిళ్ళలో వెలుగులు నింపే పండగ,దీనిని  టీ.వీ. లు చూస్తూ   గడిపేయడం కన్నా, మన భాషకు దగ్గరవతూ గడపడం  మంచిది .  ఎందరో కవులు ఇంకెందరో  మహనీయులు  ఎన్నొ విధాలుగా ఈ పండగ గూర్చి వర్ణించి  తరించారు  వారందిరినీ గుర్తు చేసుకుంటూ, మన భాష కు  మనం మరింత దగ్గరవుతూ  సాయంత్రం  గడిపామను కోండి ఆ హాయే వేరు కదూ, మన అపార్ట్మెంట్లలో  ఉన్న వాళ్ళం అందరం కూర్చొని ఒక చిన్న గోష్టి లాంటిది పెట్టుకున్నాం  అనుకోండి ఎంత బావుంటుంది, ఎన్ని విషయాలు తెలుస్తాయి.  ఎటూ  వసంత  నవరాత్రులు    ప్రారంభం అవుతున్నాయి  కాబట్టి కాసేపు రామ నామం చెప్పుకున్నా అద్భుతం గా ఉంటుంది.

ఇవన్నీ మీకు తెలియవనీ కాదు , నాకేదో తెలుసనీ కాదు , నేను చెప్తే మీరు విని నేర్చుకోవాలనీ కాదు ,ఈ విషయాలలో నేను అందరికన్న చిన్న వడినే , ఏదో ఉగాది కాబట్టీ నాలుగు మాటలు చెప్పుకొవాలని పించి మాటలు చెప్పడం తప్ప మరే ఉద్దేశమూ లేదని చెప్పుకుంటూ మరో సారి   మిత్రులందరికీ    శ్రీ ఖర   నామ  సంవత్సర   ఉగాది    శుభాకాంక్షలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: