శ్రీ సమర్థ రామదాసస్వామి

12 Jun

 జయ జయ రఘువీర సమర్థ

శ్రీ గురుభ్యోన్నమః  

          మన భరతభూమి వేద భూమి , ఎందరో  మహనీయులు యోగులు నడయాడిన పుణ్యభూమి.ఇక్కడ ఎందరో మహనీయులు జన్మించారు,సద్గురువులై మనకు మార్గదర్శులై నిలిచారు. ఆటువంటి మహనీయులలో సమర్థ రామదాస స్వామి వారు ఒకరు . 

 

          శ్రీ సమర్థ రామదాసస్వామి క్రీ.శ. 1608 వ సంవత్సరం లో మహరాష్ట్ర రాష్ట్రంలో మరాఠ్వాడా ప్రాంతంలో జాంబ్ గ్రామం లో, శ్రీ రామనవమి రోజున జన్మించారు.తల్లిదండ్రులు వారికి పెట్టిన పేరు నారాయణ్ సూర్యాజీ థోసార్.క్రీ.శ 1620 వ సంవత్సరం లో ఆయనకు వివాహం జరుగుతున్న సమయం లో ,పురోహితులు సావధాన మంత్రములు చదువుతున్నప్పుడు వివాహ బంధం లోకి వెళ్ళడం ఇష్టం లేక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఆ తరువాత స్వామి నాసిక్ దగ్గర లోని టాక్లి గ్రామానికి వెళ్ళారు.అక్కడ స్వామి  పన్నెండు సంవత్సరముల పాటు తపస్సు చేసి శ్రీ రామానుగ్రహము పొందారు.   

         శ్రీ సమర్థ రామదాసస్వామి గా ఖ్యాతి నొందిన స్వామి తన 24 వ ఏట భారతదేశ తీర్థ యాత్ర ను ప్రారంభించారు,పన్నెండేళ్ళపాటు స్వామి భారతదేశ నలుచెరగులా పర్యటించారు,ఈ పర్యటన లో స్వామి దేశ ప్రజల యొక్క వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన స్వామి,ప్రజల కష్టాలను దూరం చేయాలి ,హైందవధర్మ విలువలను ప్రజలకు అందించాలి అనే తన మహాకార్యమును కృష్ణా నదీ తీరం లో ప్రారంభించారు.

         శ్రీ సమర్థ రామదాసస్వామి శ్రీ రామతత్వాన్ని బోధించారు,స్వామి హనుమలా కార్యదీక్ష నలవరుచుకొమ్మని భక్తులకు సూచించారాయన.ఎన్నో హనుమత్ మఠములను స్వామి స్థాపించారు. 

         క్రూరులైన పాలకులు ,వారి అత్యాచారాలు నాటి ప్రజలను నిరాశా నిస్పృహల లోనికి నెట్టాయి.ఆ విధంగా నిస్తేజంగా ఉన్న ప్రజలకు స్వామి బోధలు కొత్త మార్గాన్ని చూపాయి,వారికి కొత్త స్ఫూర్తినిచ్చాయి,నాటి మహరాష్ట్ర సమాజం ఒక కొత్త ఉత్సాహం తో బానిసత్వ సంకెళ్ళు తెంచుకొని ,స్వతంత్రాన్ని సాధించి,హైందవ ధర్మాన్ని ఆలంబన గా చేసుకొని,సర్వతోముఖాభివృధ్ధి సాధించి ,శాస్త్ర ,శస్త్ర,ఆధ్యాత్మిక రంగాలలో అపూర్వమైన అభివృధ్ది సాధించింది.స్వామి బోధలకు ఉన్న శక్తి అటువంటిది.ఒక చత్రపతి శివాజి మహరాజు వంటి వ్యక్తి స్వామి శిష్యరికము లో తయారు అయ్యారంటే స్వామి వారి బోధల శక్తి మనకి అర్ధం అవుతుంది.

          ఛత్రపతి శివాజీ మహరాజు గారు సమర్థ రామదాస స్వామి వారి ముఖ్య శిష్యులలో ఒకరు.రాజనీతి ,ధర్మము మరియు ఆధ్యాత్మికత కు సంబంధించిన విషయాలలో స్వామి సూచించిన బాటలో నడిచారాయన.

          సమర్థ రామదాస స్వామి మనకు గొప్ప వాజ్ఞ్మయాన్ని అందిచారు .దాసబోధ,మనాచీ శ్లోకములు,ఆత్మారాం వారి రచనలలో ప్రముఖమైనవి.

          శివాజీ మహరాజు పై నున్న ప్రేమతో సమర్థ రామదాస  స్వామి వారు సజ్జనగడ్ లో ఉండేవారు , అక్కడే తపస్సు చేస్తూ శ్రీరామ తత్వమును వ్యాప్తి చేసారు.క్రీ.శ. 1681 వ సంవత్సరం లో మాఘ మాసం లో  బహుళనవమి నాడు స్వామి తన భౌతిక దేహాన్ని విడిచి విశ్వచైతన్యం లో విలీనమయ్యారు. 

 వారి మాటలు ,వారి జీవితం, వారి బోధలు అన్నీ స్పూర్తి దాయకములే ,వారు రచించిన మనాచీ శ్లోకముల గూర్చి వచ్చే టపాలలో తెలుసుకుందాం.

 జయ జయ రఘువీర సమర్థ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: