జయ జయ రఘువీర సమర్థ

19 Jun

          జయ జయ రఘువీర సమర్థ

శ్రీ గురుభ్యోన్నమః

          మా గురుదేవుల గూర్చి చెప్పకుండా మనాచీ శ్లోకముల గురించి ఒక్కమాట మాట్లాడినా మహాపరాధమును చేసినవాడినవుతాను.మా సద్గురువులు శ్రీ శ్రీ శ్రీ సాయిసుందరం మహరాజ్ వారు, స్వామి కృప వల్లే ఎక్కడో విజయనగరం జిల్లా లో ఉన్న మాకు సమర్థ రామదాస స్వామి వారి గూర్చి తెలిసింది.అణువణువునా నాకు మార్గదర్శనం చేస్తూ నన్ను మా కుటుంబాన్ని , అందరినీ నడిపిస్తున్నారు.విజయనగరము జిల్లా లో గుర్ల గ్రామం లో స్వామి ఆశ్రమం ఉంది.

          ఇక పైన మీరు చదవబోయేదంతా మా గురుదేవుల అనుగ్రహభాషణమే. శ్రీ గురువుల అనుగ్రహము చేత మనాచీ శ్లోకముల యొక్క తెలుగు అనువాదము 2005 సంవత్సరం మార్చి నెలలో వచ్చినది. ఆ పుస్తకానికి ముందుమాట చెప్తూ గురుదేవులు ఇలా చెప్పారు .

          సమర్థ రామదాస స్వామి  వారు రచించిన ప్రసిధ్ధమైన గ్రంథములలో దాసబోధ గ్రంథరాజము ప్రథమ స్థానము వహిస్తే మనోబోధ లేక మానసబోధ,దాసబోధకు తీసిపోనిది.ఈ మనోబోధ శ్లోకములను మనాచీ శ్లోకములని అంటారు.సమర్థులవారి శిష్యులు భిక్షాటనకు పోవునపుడు ఇంటింటా పాడవలసిన శ్లోకములే మనాచీ శ్లోకములు. వీటిని రామదాస స్వామి మృదుమధురమైన మరాఠీ భాష లో రచించారు.ఇవి మొత్తం 205 శ్లోకములు.ప్రతీ శ్లోకము నాలుగు చరణములు కలిగి వుంటాయి.ఈ అతి చిన్న శ్లోకములు భావ గంభీరములై వేదాంత సారము సర్వశాస్త్ర సారము కలిగి ఉంటాయి.ఇందు రామదాస స్వామి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించిన నిష్కామ కర్మయోగమును అనుసరించమని బోధించెను.

          రాముడే పరమేశ్వరుడు,రామ నామస్మరణ ప్రాశస్త్యము తెలుసుకొని రాముని పూజించి మారుతి భక్తి మార్గమున మోక్షగామి కావలెను.ఇంద్రియ నిగ్రహము సజ్జన సాంగత్యము యొక్క ప్రాశస్త్యము ,వివేకయుత జీవనము,గురు సేవ, మనోవాక్కాయ కర్మల ఏకీభావమును ప్రజలు గుర్తించవలెను.సోమరితనమునకు స్వస్తి చెప్పి,జాతి అంతా ఏకమై కార్యాచరణమునకు సాగి,ఉత్సాహపూరితముగా పురోగమించవలెను.

ఈ విధముగా రామదాస స్వామి మనాచీ శ్లోకములను కర్మ,జ్ఞాన,భక్తి యోగములను ఉద్భోదించి జాతిని జాగృతం చేసెను. 

          స్వామివారు రచించిన మనాచీ శ్లోకములువ్యవహారిక మరాఠీ భాష లో ఉండుటచే ,తెలుగువారికి అందుబాటులో ఉండుటకు మరాఠీ మూలశ్లోకములకు అర్థము తెలుగులో గ్రహించి,మూల శ్లోకములు పారాయణ గావించు వారికి అనుకూలముగా ఉండవలెనను ఉద్దేశ్యము తో తెలుగులో అనువదించబడినవి  కర్మ,ఉపాసన,జ్ఞాన,భక్తి ప్రతిపాదన గావించెడి ఈ శ్లొకములను ఆంధ్ర లోకము చదివి మననము గావించి భగవద్భక్తిని పొంది పరమార్ధం పొందుదురు గాక అని ప్రార్థిస్తూ ……

 శ్రీ శ్రీ శ్రీ 

 సమర్థసద్గురు   

 సాయిసుందరం మహరాజ్

తర్వాతి టపా లో మనం మనాచీ శ్లోకములను  చదువుదాం .

జయ జయ రఘువీర సమర్థ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: