మనాచీ శ్లోకములు (1—5)

19 Jun

1.  గణాధీశ! జో ఈశ సర్వాం గుణాంచా

     ముళారంభ ఆరంభ తో నిర్గుణాచా|

     నమూం శారదా మూళ చత్వార వాచా

     గమూం పంథ ఆనంత యా రాఘవాచా|| శ్రీరాం||     

అనంతమగు శ్రీ రామతత్వమును దెలిసికొనుటకై సర్వసద్గుణములకు నధీశుడగు శ్రీగణపతి  దేవునకు,నిర్గుణ తత్వ మూలాధారమగుచు పరా,పశ్యంతీ,మధ్యమా,వైఖరీ వాక్కులకు నాధారభూతయగు శారదా దేవికిని నమస్కరించు చున్నాడను. 

2. మనా! సజ్జనా భక్తి పంధేచి జావే

      తరీ శ్రీహరీ పావిజేతో స్వభావే

      జనీ నిద్యం తే సర్వ సోఢూనీ ద్వావే

      జనీ వంద్య తే సర్వ భావే కరావే ||శ్రీరాం|| 

ఓ మనసా! సాధుసజ్జనులు నిందించెడి కార్యములను వదిలి వారు ఆచరించి మనకు చూపిన కార్యములను ఆదరముతో చేయుచూ ,ఇతర మార్గములను విడిచి కేవలం భక్తి మార్గమును పట్టి ప్రవర్తించినచో నీవు తప్పక శ్రీ హరిని పొందగలవు. 

3. ప్రభాతే మనీ!రామ చింతీత జావా

    పుఢే వైఖరీ రామ ఆధీ వదావా

    సదాచార హా  థోర సాండూ నయే తో

    జనీం తోచి తో మానవీ ధన్య హోతో || శ్రీ రాం||

 ఓ మనసా! ప్రభాత కాలమున శ్రీరాముని ధ్యానించి అటు తరువాత రామనామ కీర్తన గావింపుము.యీ సదాచారమును వదలక అనుష్టించువాడే మానవులలో ధన్యుడు . 

4. మనా వాసనా దుష్టకామా నయే రే

     మనా సర్వదా పాపబుధ్ధీ నకో రే

     మనా ధరమతా నీతి సోడూం  నకో హో

     మనా అంతరీ సార వీచార  రాహో ||శ్రీరాం||  

ఓ మనసా! దుష్ట వాసనలకును,కామములకును చోటు నొసగకుము,పాపబుధ్ధులను వదులుము.నీతియు ధర్మమును వదలక నెల్లప్పుడు అంతరంగమున సదాచార  విచారము చేయుచుండుము. 

5. మనా పాపసంకల్ప సోడూని ధ్యావా

     మనా సత్య సంకల్ప జీవీ ధరావా|

     మనా కల్పనాతే నకో వీషయాంచీ

     వికారే ఘడే హో జనీ సర్వ చీ చీ ||శ్రీరాం||  

ఓ మనసా!,పాపసంకల్పములను వదలి సత్యసంకల్పములనే గావించుచుండుము. విషయము కల్పనములచే వికారములకు లోనై ప్రపంచమున నిందలు బొందవలసి యుండును.కావున విషయ సంకల్పములను మానుము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: