మనాచీ శ్లోకములు (16—20)

25 Jun

16. మరే యేకత్యా చాదుజా శోకవాహే

        అకస్మాత్ తోహి పుఢే జాత ఆహె

        పురే నాజనీ లోభరే క్షోభత్యాతే

        హ్మణొనీ జనీ మాగుతా  జన్మఘేతే  ||శ్రీ రాం||

 ఓమనసా! ఒకడు మరణింప మరియొకడు వానికై శోకించి తుదకు శోకించిన  వాడుగూడ  మరణించుచున్నాడు .లోభముచే  వాసనలు పూర్ణసిధ్ధినొందక  మరణానంతరము  వాసనాతృప్తి కై మరల జన్మించుచున్నాడు.

17.  మనీ మానవా వ్యర్థచింతా వహాతే

         అకస్మాత హోణార హోవూని జాతే!

         ఘడే భోగణే సర్వహీ కర్మయోగే

         మతీ మందతే ఖేదమాని వియోగే  ||శ్రీ రాం||

 ఓమనసా! మానవులెంతవ్యర్థచింతలుచేసినను కానున్నది కాకమానదు.కర్మానుగుణముగ సర్వమును తప్పక సంభవించుచునే యుండును.కేవలమతిమందులు మాత్రము వియోగముచే దుఃఖమునొందు చుందురు.కాన,కర్మాను సారము ప్రాప్తమగువానికి చలింపకుండవలెను.   

18. మనా రాఘవేవీణ ఆశా నకోరే

       మనా మాన వాచీన కో కీర్తి తూంరే |

       జయా వర్ణితీ వేదశాస్త్రేం పురాణేం

       తయా వర్ణితాం సర్వహీ శ్లాఘ్యవాణే ||శ్రీ రాం||

ఓమనసా! ఏమహనీయుడగు రాముని గుణగణములు వేదశాస్త్రపురాణములు వర్ణించుచున్నవో అట్టి రాముని కీర్తించుటచే జీవితము ధన్యమగును.కావున ఓమానవా ! రాఘవుని కీర్తించుట తప్ప మానవులను పొట్టకూటికై కీర్తించుట మానుము.

19. మనా సర్వధా సత్యసాండూ నకోరే

       మనా సర్వధా మిథ్య మాండూ నకోరే|

       మనా సత్యతే సత్యవాచే వదావే

       మనా మిథ్యతే మిధ్య సోడూ నిధ్యావే ||శ్రీరాం|| 

ఓమనసా! సత్యమగు బ్రహ్మమార్గమును వదలకుము.మిధ్యమగు మాయలకు లోబడకుము.సత్యపదార్థమెప్పటికినీ సత్యముగాన దానినే బలుకుచుండుము. మిధ్యపదార్థ మెప్పటికినీ మిధ్యగాన దానిని వదిలివేయుము

 

20. బహు హింపుటి హోయిజే మాయ పోటీ

        నకోరే మనా యాతనా తేచీ మోటీ |

        నిరోధే పచే కొండిలే గర్భవాసీ

        అధోమూఖ రే దుఃఖ త్యా బాళకాసీ ||శ్రీరాం|| 

ఓమనసా! తల్లిగర్భమున తలక్రిందులగ నుండి వాయునిరోధముచే అనేకదుఃఖములను  యాతనలను అనుభవించు గర్భవాసము నరకము వంటిది. గర్భవాసము దారుణ దుఃఖములచే గూడియున్నది .అట్టి గర్భవాస దుఃఖమును తప్పించుకొను ప్రయత్నము జేయమని భావము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: