మనాచీ శ్లోకములు (21—25)

29 Jun

21. మనా వాసనా చూకవీ యేర ఝారా

       మనా కామనా సాండిరే ద్రవ్యదారా|

       మనా యాతనా ధోరహే గర్భవాసీ

       మనా సజ్జనా భేటవీ రాఘవాసీ ||శ్రీరాం|| 

ఓమనసా! గర్భవాసము నరకప్రాయము గనుక అట్టి  గర్భవాసమును గలిగించెడి ద్రవ్యదారలయందు ఆసక్తులను వదిలి, జన్మమరణముల దప్పింపుము. ఓమనసా! ఇట్టి సహాయమును గావించి నాకు దర్శనము నొడగూర్చుము. 

22. మనా సజ్జనా హీత మాఝే  కరావే

        రఘూనాయకా దృఢచిత్తీ ధరావే|

        మహారాజ తో స్వామి వాయూసుతాచా

        జనా ఉధ్ధరీ నాథ లోకత్రయాచా ||శ్రీరాం|| 

ఓమనసా! త్రైలోక్యాధిపతియగు,వాయుసుతుడగు మారుతికి స్వామియగు శ్రీరాముని దృఢముగా సేవించి నాయాత్మహితమునుగావింపుము

23. నబోలే మనా రాఘవేవీణ  కాంహీ

        జనీ వావుగే బోలతా సూఖనాహీ |

        ఘడీనే ఘడీ కాళ ఆయుష్యనేతో

        దేహాంతీ తులాకోణ సోడూం పహతో? ||శ్రీరాం||  

ఓమనసా!  శ్రీరామవ్యతిరిక్తములగు సంభాషణలు గావింపకుములౌకికవ్యర్థసంభాషణలచే సుఖమొక్కింతయును లేదు . క్షణక్షణమునకు ఆయుష్యము క్షీణమగుచున్నది. గాన దేహావసానసమయమున శ్రీరాముడు తప్ప మరియొకడు నిన్ను కాలుని బారినుండి తప్పించగలడా 

24. రఘూ నాయకా వీణవాయాం శిణావే

        జనా సారిఖే వ్యర్థకాంవో సణావే ?

        సదా సర్వదా నామవాచే వసోదే

        అహంతా మనీ పాపిణీ తేనసోదే ||శ్రీరాం||  

ఓమనసాఅట్టిసమర్థుడగు శ్రీరాముని చింతింపక పామరునివలె విషయసుఖములకై పరితపించి ఏలయాక్రందించెదవుసర్వకాలము అహంకారము వదలి శ్రీరామనామమును సేవించుచుండుము.

 25. మనా వీటమా నూనకో బోలణ్యాచా

         పుఢే మాగుతా రామ జోడేలకైచా|

         సుఖాచీ ఘడీ లోటతాం సూఖఆహే

         పుఢే సర్వజాఈలకాహీ రాహే ||శ్రీరాం|| 

ఓమనసా! మాటికిమాటికినే జెప్పెడు హితవాక్యములచే విసుగు జెందబోకుము ఏలనన ఈజన్మము వ్యర్థమైనచో మరల సుఖములను భవించుకాలమున సర్వకాలము సుఖములుండునని తోచునే గాని  అందొక్కటియైనను నిలువక నాశనములు కాగలవు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: