మనాచీ శ్లోకములు (26—30)

3 Jul

26. దెహే రక్షణా కారణే యత్నకేలా

        పరీ శేవటీ కాళ ఘేవూని గేలా |

        కరీరే మనా భక్తియా రాఘవాచీ

        పుఢే అంతరీ సోడి చింతా భవాచీ ||శ్రీరాం|| 

ఓమనసా! దేహమురక్షించుకొనుటకై ఎన్ని విశ్వప్రయత్నములు చేసినను తుదకు కాలమగు సరికి కాలుడు వంచించు దానిని గొనిపోవుచున్నాడు.అందుచే నశించెడు స్వభావము గల  యీదేహమును రక్షించుకొను  ప్రయత్నములు మాని అంతరంగమున సంసార చింతలను వదలి రాఘవుని భక్తిని దృఢము గావింపుము.

27. భవాచ్యా భయే కాయభీ తోసి లండీ

        ధరీరే మనా ధీరథాకా సిసాండీ|

        రఘూనాయకా సారిఖా స్వామి శిరీం

        నుపేక్షీ కదాకో పల్యా దండధారీ ||శ్రీరాం||

 

ఓపిరికిమనసా ! భవభయముల కేల భీతి నొందెదవు? ధైర్యము వహింపుము.సర్వభయముల విడనాడుము.రఘునాయకుని వంటి స్వామిరక్షకుడై యుండకాలుడు నీపై కోపించినను రాముడు రక్షింపగలడు.

28. దినానాథహా రామ కోదండధరీ

        పుడే దేఖతాం కాళపోటీ థరారీ|

        మనా వాయనే మస్త హే సత్యమానీ

        నుపేక్షా కదా రామదాసాభిమానీ||శ్రీరాం||

 

ఓమనసా! దీనసంరక్షకుడును,కోదండధారియగు రామునిగాంచి నంతనే భయంకరుడగు కాలుడు సైతము గడగడవణుకును.ఇది ముమ్మాటికిని నిజము,రాముడెన్నటికినీ దాసజనుల నుపేక్షించువాడుకాదు 

29. పదీం రాఘవాచే సదా బ్రీదగాజే

        బళేం భక్త రీపూ శిరీ కాంబి వాజే |

         పురీ వాహిలీ సర్వజేణే విమానీ

         నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం|| 

ఓమనసా ! రాఘవుని పాదకంకణము తన భక్తుల యొక్క శత్రువుల శిక్షించెదనని సర్వదా గర్జించుచున్నది.అయోధ్యాపురజనులనందరినొకే మారు విమానమున వైకుంఠమునకు గొనిపోయిన సర్వసమర్థుడగు రాముడు తనదాసజనుల నెన్నటికి యుపేక్షించువాడుకాదు.   

30. సమర్థాచియా  సేవకా  వక్రపాహే

         అసా సర్వభూమండళీ  కోణ ఆహే ?

         జయాచీలిళా వర్ణితీలో కతీన్హీ

         నుపేక్షీ కదా రామదాసాభిమానీ  ||శ్రీరాం||  

ఓమనసా ! ఎవ్వనియద్భుతలీలలు మూడుజగంబులందు వర్ణింపబడుచున్నవో ,అట్టి శ్రీరాముని భక్తుని వక్రదృష్టితో చూడగలవారున్నారా? అనగా రామభక్తులను భూమండలమున నెవ్వడును పరాభవించి బ్రతికిపోజాలడు .శ్రీరాముడు తనదాసజనులనెన్నటికి యుపేక్షించువాడు కాడు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: