మనాచీ శ్లోకములు (31—35)

5 Jul

31. మహా సంకటి సోడిలే దేవజేణే

        ప్రతా పేబళే ఆగాళా సర్వగూణే !

        జయాతే స్మరే శైలజా శూలపాణీ

        నుపేక్షీ కదా రామదాసాభిమానీ  ||శ్రీరాం|| 

ఓమనసా! రావణుని బందిశాలయందు మహాదుఃఖముల నుండెడి ముప్పదిమూడుకోట్ల దేవతలనెవడు బంధవిముక్తుల గావించెనో, బలప్రతాప సుగుణముల యందెవ్వడగ్రగణ్యుడో, స్మరించుచుండునో, అట్టి శ్రీరాముడు తన దాసులనుపేక్షించుట కలలో వార్త.

32. అహిల్యా శిళా రాఘవే ముక్తకేలీ

        పదీం లాగతాం దివయ్హో వూనీగేలీ|

        జయా వర్ణితాం శీణలీ వేదవాణీ

        నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం|| 

ఓమనసా! ఎవ్వడు తనపాదరజముచే శాపవశమున శిలయై పడియుండిన అహల్య నుధ్ధరించి పూర్వ రూపము నొసంగెనో, ఎవ్వని మహాత్యము వర్ణింప జాలక వేదములు కుంఠీభూతములయ్యెనో,అట్టి శ్రీరాముడు తనదాసజనుల చేయినెన్నటికినీ విడువజాలడు 

33. వసే మేరు మాందారహే సృష్టిలీళా

       శశీ సూర్యతారాం గణే మేఘమాళా

        చిరంజీవ కేలే జనీ దాసదోణీ

        నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం|| 

ఓమనసా! మేరుమందరపర్వతములును, మేఘపంక్తులును, సృష్టియు, నుండు వరుకు ఆచంద్రతారార్కముగ తన భక్తులగు   మారుతి విభీషణులను చిరంజీవుల గావించిన శ్రీరాముడు భక్తులనెన్నటికి యుపేక్షించువాడు కాడు

34.  ఉపేక్షా కాదా రామరూపీ  అసేనా

         జివా మానవాం నిశ్చయీతో వసేనా |

         శిరీం భారవాహే నబోలేపురాణీం

         నుపేక్షీ కదా రామదాసాభిమానీ  ||శ్రీరాం|| 

ఓమనసా!భక్తుల  నుపేక్షించు గుణము రామునియందెన్నటికినిలేదు. అయినను, పామరులగుజీవులు అట్టి నిశ్చయము చే రాముని నమ్మియుండ జాలకున్నారు. భక్తుల యోగక్షేమముల వహించెదనని పురాణప్రసిధ్ధముగ ఘోషించిన శ్రీరాముడు భక్తులనుపేక్షించుట దుర్ఘటము.

35. అసేహో జయా అంతరీ భావ జైసా

         వసేహో తయా అంతరీ దేవతైసా |

         అనన్యా సరక్షీతసే చాపపాణీ

         నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం||

ఓమనసా! ఎవని యంతరంగమున భగవంతుని యందలి భక్తిభావమెట్లున్నచో భగవంతుడు కూడనట్టులే భక్తుని యంతరంగమున నుండి రక్షించుచున్నాడు. అనన్యముగ శరణునొందిన భక్తుల సర్వవిధముల రక్షింపగల శ్రీరాముడు  భక్తులనణుమాత్రము మరుచువాడు కాడు.

Advertisements

2 Responses to “మనాచీ శ్లోకములు (31—35)”

 1. Aparna Nittala July 7, 2011 at 6:31 pm #

  Dear Subbu garu,

  Nice work. I also visited your other blog (?) and read some posts you have written about political issues. Very interesting and well-written articles.

  Good luck.

  Best Wishes,
  Aparna

  • Subramanyam K.V. July 7, 2011 at 10:48 pm #

   Thank you Aparna garu
   yeah that’s my other blog and I keep blogging n political issues. Thanks again for the kind words .

   Regards
   Subbu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: