మనాచీ శ్లోకములు (36—40)

7 Jul

36.  సదా సర్వదా దేవసన్నీధ ఆహే

         కృపాళూ పణే అల్ప ధారిష్ట పాహే

         సుఖానంద ఆనంద కైవల్యదానీ

         నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం||

 ఓమనసా!  దేవుడెల్లపుడు జీవునిచెంతనే వసించుచుండును. భగవంతుడు కృపాళుడై జీవుని పలుమార్లు పరీక్షించుచుండును. అట్లు పరీక్షించుట జీవునకు మనోదార్ఢ్యము గలుగజేయుటకే. మనోనిశ్చయము కలదని తోచిన వెంటనే జీవునకు భగవంతుడు సుఖము ఆనందము  కడపట కైవల్యమును కూడ నొసగును.  అట్లు కృపాళుడై అల్పముగ భక్తుని పరీక్షించి ,శుభములొసగెడు శ్రీరాముడు భక్తులనుపేక్షింపడు. 

37. సదా చక్రవాకాసి మార్తండ జైసా

        ఉఢీ ఘాలితో సంకటీ స్వామి తైసా |

        హరీ భక్తిచా ఘావగాజే నిశాణీ

        నుపేక్షీ కదా రామదాసాభిమానీ ||శ్రీరాం||

 ఓమనసా! వియోగ వ్యధచే దీనస్వరములనాక్రందించెడి చక్రవాకజంట యొక్క బాధల నెరిగి సూర్యభగవానుడు వాటికి దర్శనమిచ్చి బాధలనెట్లు నివారించుచున్నాడో  ,అట్టులే భగవంతుడు కూడా అనన్యుడగు భక్తుని మోరాలించి సంకటముల బావుచున్నాడు.తన యందలి భక్తి సర్వదుఃఖనివారకమని ఘంటాపదముగా పలుకుశ్రీరాముడు భక్తులనుపేక్షింపడని భావము.

38. మనా ప్రార్థనా తూజలా ఏక ఆహే

      రఘూరాజ ధక్కీతహో వూని పాహే

      అవజ్ఞా కదాహో యెదర్థీ నకీజే

      మనా సజ్జనా రాఘవీ వస్తికీజే ||శ్రీరాం||

 సజ్జనమగు ఓమనసా! నేను నిన్ను ప్రార్థించుసమయమున విస్మయానందచిత్తుడవై రాఘవుని ధ్యానించి సేవించుచుండుము.అందుచే నీవు సర్వశుభములనాకొడగూర్చిన దానవగుదువు. నాప్రార్థన త్రోసిపుచ్చక రాఘవుని యందే సర్వకాలము రమించుచుండుము.

 39.  జయా వర్ణితీ వేదశాస్త్రే పురాణే

          జయా చేని యోగే సమాధాన బాణే|

          తయాలాగీహే సర్వచాంచల్య  దీజే

         మనా సజ్జనా రాఘవీ వస్తికీజే ||శ్రీరాం||

 ఓమనసా! ఎవ్వని లీలలు వేదశాస్త్రపురాణములు కూడా వర్ణించలేవో, ఎవ్వని అనుగ్రహముచే మానవులకు సంపూర్ణ సమాధానభాగ్యమబ్బుచున్నదో అట్టి రాఘవుని  పదములకు నీనైజమగు చంచలస్వభావముల నర్పించి రాఘవుని యందే సర్వకాలము రమించుచుండుము.

40. మనా పావిజే సర్వహీ సూఖ జేథేం

        అతీ ఆదరే టెవిజే లక్ష తేథేం

        వివేకే కుడీకల్పనా పాలటీజే

        మనా సజ్జనా రాఘవీవస్తికీజే ||శ్రీరాం||

 ఓమనసా!  సర్వసుఖములకు ఆశ్రయభూతుడగు శ్రీరామపదములందు అత్యాదరమున లక్ష్యముంచి ధ్యానింపుము. వివేకముచే నీదుష్టసంకల్పముల మార్చుకొని సర్వకాలము రామపదయుత్తుడవై రాఘవుని యందే రమించుచుండుము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: