మనాచీ శ్లోకములు (41—45)

9 Jul

41. బహుహిండతాం సౌఖ్య హోణార నాహీ

       శిణావే పరీ నాతుడే హీత కాంహీ |

        విచారే బరే అంతరా బోధవీజే

        మనా సజ్జనా రాఘవీ వస్తికీజే  ||శ్రీరాం|| 

సజ్జనమగు ఓమనసా ! చాంచల్యమున పలుతావుల విశేషముగా సంచరించుటచే సౌఖ్యమణుమాత్రమును పొందజాలకపోవుటయేగాక అట్లు పరిబ్రహించుటచే కడపట సుఖశాంతులను గాంచజాలక  దుఃఖమును మాత్రమనుభవింపగలవు .కావున అంతరంగమున చక్కగా విచారించి బోధయుతుడవై రాఘవుని పదములందే సర్వదా రమించుచుండుము 

42. బహుతాంపరీ హేచిఆతాం థరావే

       రఘూనాయకా ఆపులేసే కరావే |

       దినానాథహేతో దరీ బ్రీదగాజే

       మనా సజ్జనా రాఘవీ వస్తికీజే   ||శ్రీరాం||

 ఓమనసా !  ఎన్నివిధముల   సాధనలు గావించినను రాఘవుని నీవానిగ జేసికొను ప్రయత్నమునందు యేమరక ప్రయత్నింపుము .దీన సంరక్షకుడని బిరుదువహించి ముల్లోకముల ఖ్యాతిగాంచి నరాఘవుని పదములందు సర్వకాలము రమించుట  ఆత్మహితమని ఎఱుంగుము.

43.  మనా సజ్జనా ఏకజీవీ ధరావే

         జనీ ఆపులే హీతతూవాం కరావే

         రఘూనాయకా వీణబోలో నకోహో

         సదామానసీతో నిజధ్యాస రాహో  ||శ్రీరాం||

ఓమనసా! ఆత్మోధ్ధారమే జన్మసార్థకమగుకర్తవ్యమని గట్టిగా నెఱిగి అట్టికార్యమునకై నీశక్తులన్నియునుపయోగించి సాధింపుము శ్రీరాముని విషయమగు మాటలుదక్క అన్యభాషణముల గావింపక రాముని యందే తల్లీనుడవై నిదిధ్యాసయుత్తుడవై ప్రవర్తించినచో ఆత్మోధ్ధారము సులభముగా సాధింపగలవు. 

44. మనారే జనీ మౌనముద్రా ధరావీ

        కథా ఆదరే రాఘవాచీ కరావీ

        నసే రామతే ధామసోడూ నిధ్యావే

        సుఖాలాగి ఆరణ్యసేవిత జావే  ||శ్రీరాం||  

ఓమనసా! పామరజనుల సాంగత్యమున వ్యర్థమగు లౌకిక సంభాషణల గావింపక రామునియందు మనసు నిలిపి మౌనముగా నుండుముసంభాషింపవలసి వచ్చినచో రాఘవుని దివ్యచరిత్రల గురించియే . ఆదరమున సంభాషించి సంతోషింపుము శ్రీరాముని యందలి భక్తిశ్రధ్ధలులేని ఇంటియందు ప్రవేశించి చెడిపోవుటకంటే ఆత్మసుఖమునకై అరణ్యవాసముల కేగుటేమేలు

45. జయాచేని సంగే సమాధాన భంగే

        అహంతా అకస్మాత ఏవూని లాగే |

        తయే సంగతీ చీజనీ కోణగోడీ

        జియే సంగతీ నేమతీ రామసోడీ  ||శ్రీరాం||  

ఓ మనసా! ఎవ్వని  సహవాసముచే మనస్సమాధానము భంగమై అట్టి చోట అహంకారము విజృంభించునో,ఎవ్వని సహవాసముచే చిత్తము రామవిముఖమై విషయాభి ముఖ ముఖమగునో అట్టి వారి సాంగత్యమున నీవు ఏ లాభమును పొందగలవు? అట్టి వారి సాంగత్యమును సర్వప్రయత్నముల ఆత్మ కళ్యాణము గోరువాడు త్యజింపవలయును.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: