మనాచీ శ్లోకములు (46—50)

11 Jul

46. మనా జే ఘడీ రాఘవేవీణ గేలీ

        జనీ  ఆపులీతే తువాం హాని  కేలీ|

        రఘునాయకావీణ తో శీణ ఆహే

        జనీ దక్ష తో లక్ష లావూని పాహే ||శ్రీరాం|| 

ఓమనసా! ఆయుష్య మందలి ఎంతకాలము రామధ్యాన స్మరణ సేవ వ్యతిరిక్తముగా   గడుపుచున్నాడవో , అంతకాలము , నీవు నీ జీవితమునకు హాని గావించుకొనుచున్నాడవు. శ్రీరామభక్తిలేని జీవితము దుఃఖకారకమని నిశ్చయముగనెరుంగుము. అందుచేతనే దక్షులగు పెద్దలు శ్రీరాముని యందే అఖండమగు లక్ష్యము నుంచి జీవితమును సార్థకముగావించుకొనుచున్నారు.

 47.  మనీ లోచనీ శ్రీహరీ తోచి పాహే

          జనీ జాణతా భక్తహోవూని రాహె|

          గుణీ ప్రీతి రాఖే క్రమూం సాధనాచా

          జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం|| 

ఓమనసా! ఎవ్వడు అంతర్భాహ్యముల సర్వకాలము శ్రీహరినే  దర్శించుచున్నాడో,ఎవ్వడు జ్ఞానియై హరిభక్తుడుగానున్నాడోఎవ్వడు సుగుణారాధనతత్పరుడై గురూపదిష్ట సాధనమార్గమును క్రమముగపాలించుచున్నాడో, అట్టి సర్వోత్తముడగు భగవద్దాసుడేధన్యుడు.   

48. సదా దేవకాజీ ఝిజే దేహా జ్యాచా

      సదారామ నామే వదే నిత్య వాచా|

      స్వధర్మే చిచాలే సదా ఉత్తమాచా

      జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసా!  దైవకార్యములందెవ్వడు తన దేహపరిశ్రమ  గావించుచున్నాడో,  ఎల్లప్పుడు ఎవ్వని నోటి నుండి రామనామామృతము వెలువడుచున్నదో, ఎవ్వడు ఉత్తమరీతిని తన స్వధర్మమును పాలించుచున్నాడో , అట్టివాడు సర్వోత్తముడగు శ్రీరాముని దాసులలో ధన్యుడు. 

49. సదా బోలణ్యా సారిఖే చాలతాహే

        అనేకీ సదా ఏకదేవాసి పాహే|

        సగూణీ భజే లేశ నాహీ భ్రమాచా

        జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా||శ్రీరాం||

 

ఓమనసాచెప్పెడి మాటప్రకారము నడుచుకొనుచు అనేకదేవతలయందు ముఖ్యమగు భగవంతునొక్కనినే గాంచుచు భ్రమాతీతుడై యుండియు సుగుణపూజ, సేవ మొదలగు కార్యములప్రేమపూర్వకముగనాచరించుచుండు వాడే సర్వోత్తముడగు శ్రీరాముని దాసులలో నగ్రగణ్యుడు.   

50. నసే అంతరీ కామ నానావికారీ

        ఉదాసీన జో తాపసీ బ్రహ్మచారీ|

        నివాలా మనీ లేశ నాహీ తమాచా

        జగీ ధన్య తో దాససర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసాఅంతరంగమున కామవికారములకు లోనుగాక ఉదాసీనుడై బ్రహ్మచర్యమున  తపస్సాధనల గావించుచు, అజ్ఞానరహితుడై పూర్ణసమాధానస్థితియందుండు వాడే శ్రీరాముని సేవకులలో ధన్యుడు .  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: