మనాచీ శ్లోకములు (51—55)

13 Jul

51.  మదే మత్సరే సాండిలా స్వార్థబుధ్ధీ

         ప్రపంచీక నాహీ జయాతే ఉపాధీ |

         సదా బోలణే నమ్రవాచా సువాచా

         జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||

 ఓమనసామద మత్సర స్వార్థబుధ్ధి మొదలుగా గల లౌకికయుపాధుల బాధలేని వాడును ఎల్లపుడు వినయపూర్వకముగా నితరులతో మధుర సంభాషణలుగావించువాడే శ్రీరామ సేవకులలో శ్రేష్టుడు.

 52.  క్రమీవేళ జో తత్వచింతాను వాదే

         నలింపే కదా దంభవాదే వివాదే |

         కరీ సూఖసంవాద జో ఊగమాచా

         జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసా!  అనుదినము మహావాక్యతత్వచింతన గావించుచు,  ఇతరుల కొఱకు వాటి రహస్యార్థములను వ్యాఖ్యానించుచు , వితర్కవాదములందును, డాంబికవాదములందును, కాలము గడుపక మూలపురుషుడగు భగవంతుని విషయమై పెద్దలగు  భగవద్భక్తులతో సుఖరూపముగా సంభాషించువాడే రామభక్తులలోనగ్రగణ్యుడు 

53. సదా ఆర్జవీ ప్రీయ జో సర్వలోకీ

        సదా సర్వదా సత్యవాదీ వివేకీ  |

        నబోలే కదా మిథ్యవాచా త్రివాచా

        జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసా!  ఎల్లప్పుడు ఋజుభావమున వర్తించువాడును, సర్వులకుప్రియుడును ,వివేకయుక్తుడును, సత్యవాదియు అసత్యములాడనివాడును, శ్రీరామదాసులలో ధన్యతముడు 

54.  సదా సేవి ఆరణ్య తారుణ్య కాళీ

         మిళేణా కదాకల్పనే చేని మేళీ |

         చళేనా  మనీ నిశ్చయో దృఢజ్యాచా

         జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా ||శ్రీరాం||  

ఓమనసా! తారుణ్యకాలమున అరణ్యములనేకాంతమున కాలము గడుపుచుభగవద్విషయమున శుష్కవాదములందెగల్గు కల్పనలకు లోనుగాక చలింపని నిశ్చయజ్ఞానముచే నుండువాడే సర్వోత్తముని భక్తులలో శ్రేష్టుడు. 

55.  నసే మానసీ నష్ట ఆశా దురాశా 

         వసే అంతరీ ప్రేమపాశా పిపాశా |

          ఋణీ  దేవహా భక్తిభావే జయాచా

          జగీ ధన్య తో దాస సర్వోత్తమాచా  ||శ్రీరాం||  

ఓమనసా! ఎవ్వని మనమున స్వార్థ రూపమగు దురాశలుండవో ఎవ్వని యంతరంగము భగవత్ప్రేమచే నిండి,భగవద్దర్శన లాలసుడై యుండునో ,యెవ్వడు తన భక్తిచే భగవంతుని  ఋణస్థుని గావించుకొని యుండునో,అట్టివాడే భగవద్భక్తులతో  నగ్రగణ్యుడు.

Advertisements

One Response to “మనాచీ శ్లోకములు (51—55)”

 1. Ravi October 1, 2011 at 7:38 pm #

  Nice Work Subramanyam.

  I liked your idea and efforts to share this work with every one.

  Keep it up.

  Thanks,
  Ravi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: