మనాచీ శ్లోకములు (61—65)

18 Jul

61.  ఉభాకల్పవృక్షా తళీ దుఃఖ వాహే 

        తయా అంతరీ సర్వదా తేచి రాహే |

        జనీ సజ్జనీ వాద హా వాఢవావా

        పుఢే మాగుతా శోక జీవీ ధరావా  ||శ్రీరాం|| 

ఓమనసాకల్పవృక్షము నీడ కేగి ఎవ్వడెద్ది కోరునో , దానినే తప్పక బడయగలడు. అట్టి వృక్షము క్రింద చేరియు దుఃఖించెడి మానవుడు తనజీవితమున దుఃఖమును తప్ప సుఖముననుభవింపజాలడు .అట్టులే శ్రీరామునాశ్రయించిన  మానవుడు ఉత్తమపదములగోరక శబ్ద జ్ఞాన పాండిత్యముల తన జీవితమును గడుపుచు, నుండువాడు తనజీవితమును  దుఃఖభాజనము గావించుకొనుచున్నాడు. 

62. నిజధ్యాస తో సర్వతూటోని గేలా

        బళేఆంతరీ శోక సంతాప ఠేలా  |

        సుఖానంద ఆనంద భేదే బుడాలా

        మనీ నిశ్చయో  సర్వఖేదే ఉడాలా ||శ్రీరాం||

 ఓమనసారామాశ్రయమును గాంచి వాద వివాదములందును, పాండిత్యము ప్రకర్షములందును, కాలము గడుపువాడు రామునియందలి నిదిధ్యాసను గోలుపోయి అంతరంగమున శోకసంతాపములచేమ్రగ్గుచు, రామధ్యానముచేగలుగు సుఖానందములను ఖేదబుధ్ధులచే గోలుపోయి మనోనిశ్చయమంతరించి దుఃఖములకు పాత్రుడగుచున్నాడు .

 63.  ఘరీ కామధేనూ పుఢే తాకమాగే

          హరీ బోధ సాండూని వీవాద లాగే

          కరీసార చింతామణీ  కాచఖండే

         తయా మాగతాం దేత ఆహే ఉదండే  ||శ్రీరాం||  

ఓమనసా ! ఇంటియందు కామధేనువుండ   పొరుగిండ్ల కేగి మజ్జిగకై యాచించువానివలె అంతరంగమున  శ్రీహరిధ్యానముచేగలుగు సహజానందమును వదలివాదవివాదములచే సంతోషించెడి మనుష్యుడు మూఢుడని తప్పక తెలిసికొనుము. సర్వకోరికల నొసగెడి చింతామణి చేతి యందుండ అట్టి చింతామణిచే గాజుకుప్పెల సంపాదింపగోరువాడు , గాజుకుప్పెలను విశేషముగ సంపాదించగలడేగాని చింతామణిచే గలుగు పరమసౌఖ్యముల బొందజాలడు

64.  అతీమూఢ త్యా దృఢబుధ్ధీ అసేనా

         అతీ  కామత్యా రామచిత్తీ వశేనా |

         అతీ  లోభత్యా క్షోభ హోయీల జాణా

         అతీ  వీషయీ సర్వదా దైన్యవాణ్యా  ||శ్రీరాం|| 

ఓమనసా! అతిమూఢుడగువానికి దృఢబుధ్ధియుండజాలదు. అతికోరికలు ఉండువానికి  రామచింతన సాధ్యము కాదు. మిక్కిలి లోభియగువానికి జీవితమంతయు సంక్షోభితముగనుండును. విషయలోలుడెప్పటికిని దీనుడై దుఃఖమనుభవింపగలడు.పై దుర్గుణములచే మానవునికి భగవద్భక్తిసంభవించుట దుర్లభము

65.  నకో దైన్యవాణే జిణే భక్తిఊణే

         అతీమూర్ఖత్యా సర్వదా దుఃఖదూణే |

         ధరీరే మనా ఆదరే ప్రీతిరామీ

         నకో వాసనా హే మధామీం విరామీ  ||శ్రీరాం||  

ఓమనసా! భక్తిలేని దరిద్రజీవితముపై నాధారపడబోకుముభక్తిలేనివాడు మూర్ఖులలో పరమమూర్ఖుడు. భక్తిహీనుడై విషయలంపటుడగు వానికి ద్విగుణీకృత దుఃఖములననుభవింపవలసివచ్చును. కావున రామునియందు భక్తి గలిగి ఐశ్వర్యములందలి వాసనలు త్యజింపుము.  

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: