మనాచీ శ్లోకములు (66—70)

20 Jul

66.  నహ్వే సార సంసార హా ఘోర ఆహే

         మనా సజ్జనా సత్య శోధూని పాహే

         జనీ  వీష  ఖాతాంపుఢే  సూఖకైచే?

         కరీరే  మనా ధ్యాన యా రాఘవాచే  ||శ్రీరాం|| 

ఓమనసాసంసారము, నిస్సారమైభయంకరమగునది. గాన అట్టిదానిపైనాన చెందక సత్యవస్తువును శోధించి కనుగొనుము, విషరూపమగు సంసార  సుఖములనే సేవించుచుండినచో భావికాలమున సుఖమొందజాలవు. విషమును భక్షించి జీవించు  వారుందురా ? కావున ఓమనమా అమృతతుల్యుడగు రాఘవుని ధ్యానింపుము. 

67.       ఘన శ్యామ హా రామ లావణ్య రూపీ

              మహాధీర గంభీర పూర్ణ ప్రతాపీ |

              కరీ సంకటీ సేవకాచా కుఢావా

              ప్రభాతే మనీ రామ చింతీత జావా ||శ్రీరాం|| 

ఓమనసానీలమేఘశ్యాముడును, లావణ్యరూపియుధైర్యగాంభీర్యప్రతాపగుణములందగ్రగణ్యుడును సేవకులసంకటములను దీర్పగల శ్రీరాముని ప్రాతఃకాలమున లేచి భక్తి తో ధ్యానింపుము.

 68.   బళే ఆగళా రామ కోదండ ధారీ 

          ముహాంకాళ విక్రాళ తోహీ థరారీ

          పుఢే మానవా కింకరా కోణకేవా

          ప్రభాతే మనీ రామ చింతీత జావా ||శ్రీరాం|| 

ఓమనసా! జగదేక ధానుష్కశిరోమణియగు  శ్రీరాముని గాంచినంతనే భయంకరుడగు కాలుడు సైతము గడగడవడికి  రామాజ్ఞకు లోబడివర్తించుచుండ అల్పబలులగు మానవ కింకరుల మాట జెప్పనేల? అట్టి శ్రీరాముని నియమముగ ఉదయమున మేల్కాంచినంతనే భక్తిపూర్వకముగ ధ్యానింపుము.

69.  సుఖానందకారీ నివారీ భయాతే

         జనీభక్తి భావే భజావే తయాతే|

         వివేకే త్యజావా అనాచార హేవా

         ప్రభాతే మనీ రామచింతీత జావా ||శ్రీరాం|| 

ఓమనసా! భక్తుల భయములను ,సంకటములను, నివారణగావించి, సుఖమును, ఆనందమును గలుగజేయు శ్రీరాముని భక్తిభావముచే తప్పక భజింపుము, అట్లు భక్తిభావముచే భజించుటకు అంతరంగము శుధ్ధము గావించుకొనుము. అనాచారకృత్యముల గావింపక సదాచారమునందు ప్రవర్తించుచు శుధ్ధాంతఃకరణముచే ప్రభాతమున శ్రీరాముని ధ్యానింపుము 

70. సదా రామ నామే వదాపూర్ణ కామే

         కదా భాధిజేనా పదా నిత్యనేమే|

         మదాలస్యహా సర్వసోఢూ నిధ్యావా

         ప్రభాతే మనీ రామచింతీత జావా ||శ్రీరాం||  

ఓమనసా! పూర్ణకాముడగు, శ్రీరామునినామస్మరణ  గావింపుము. నిత్యనియమముల నామస్మరణ గావించువానికి దుఃఖములు బాధించజాలవు . నామస్మరణ గావించుటయందు ముఖ్యముగ సంభవించెడి విఘ్నములగు గర్వము,సోమరితనమును సంపూర్ణముగ వదలివేసి ప్రభాతమున  లేచి, శ్రీరాముని దివ్యమూర్తిని చింతనగావింపుము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: