మనాచీ శ్లోకములు (71—75)

22 Jul

71.    జయాచేని నామే మహా దోష జాతీ

          జయాచేని నామే  గతీ పావిజేతీ |

          జయాచేని నామే  ఘడీ  పుణ్యఠేవా

          ప్రభాతే మనీ రామచింతీత జావా ||శ్రీరాం||  

ఓమనసాఎవ్వని నామస్మరణచే మహాదోషములెల్లను సంపూర్ణముగ నాశనమొందునో ఎవ్వని నామస్మరణచే   పుణ్యములును, సద్గతులును కలుగునో అట్టిశ్రేష్టుడగు శ్రీరాముని ఉదయము మేల్కాంచినంతనే ధ్యానింపుము 

72.   నవేచాకదా గ్రంథిచే అర్థ కాంహీ 

          ముఖే నామ ఉచ్చారితాం కష్టనాహీ |

          మహా ఘోర సంసార శత్రూం జిణావా

          ప్రభాతే మనీ రామచింతీత జావా ||శ్రీరాం||   

ఓమనసా! గ్రంథపరిశోధనగావించుటకై ద్రవ్యమువెచ్చించి గ్రంథములు కొననక్కరలేదు . ద్రవ్యవ్యయములేకనే  రామనామస్మరణ గావింపవచ్చును.నోటితో రామనామముచ్చరించుటకు  కష్టమెద్దియునులేదు. ఇట్టిసులభమైన రామనామస్మరణ గావించి ప్రాతఃకాలమున  భక్తిపూర్వక రామధ్యానము చేయుటచే మహాఘోరరూపియగు సంసార శత్రువును సులభముగజయించవచ్చును

73.    దెహే దండణేచే  మహాదుఃఖఆహే

           మహాదుఃఖ  తేనా మఘేతాం రాహే |

           సదా శీవ  చింతీతసే దేవదేవా

           ప్రభాతే మనీ రామచింతీత జావా ||శ్రీరాం||

   మనసా! జపతపాదులచేతను,  తీర్థయాత్రలచేతను,  భగవత్ప్రాప్తిని పొందవలెనన్న దేహమును కష్టపెట్టవలసివచ్చును. అట్టిది నామస్మరణయందణుమాత్రమును లేదు. దేవదేవుడగు సదాశివుడు ఏనామమును సర్వకాలము స్మరించుచుండునో,అట్టి  రాముని ప్రభాతకాలమున నిండుమనముచే ధ్యానింపుము.   

74.   బహూతాం పరీ సంకటే సాధనాచీ

          వ్రతేందన ఉద్యాపనే తీ ధనాచీ |

          దినాచా దయాళూ మనీ ఆఠవావా

          ప్రభాతే మనీ రామ చింతీతజావా ||శ్రీరాం||

   మనసా! పరమార్థసాధనలు చేయుట యందు అనేకసంకటములు,విఘ్నములు గలుగుటకవకాశమున్నది.అట్టి సంకటముల కోర్చుటకు చిత్తస్థైర్యము మానవులకీకాలమున లేదు . భగవత్ప్రాప్తికై పత్రములు దానములు,ఉద్యాపనలు చేయుటయున్ననవియన్నియునుధనముపై  నాధారపడియున్నవి. అందుచే దీనదయాళుడగు శ్రీరాముని నిండుమనముచే నిద్దురలేచినది మొదలుస్మరించి ధ్యానించుట సులభము శ్రేయస్కరము. 

75.  సమస్తా మధే సార సాచార ఆహే

         కళేనా తరీ సర్వశోధూన పాహే|

        జివా సంశయో వావుగా తోత్య జావా

        ప్రభాతే మనీ రామచింతీతజావా  ||శ్రీరాం||

   మనసాఅన్ని సాధనములయందును నామస్మరణయే సారభూతమగు సాధనము. దీనిసత్యత్వము నీకు గోచరింపనిచో వేదశాస్త్రపురాణములను సాధుసజ్జనవాక్యములను శోధించి కనుగొనుము .అట్లు గావించినచో సర్వకాలము నామస్మరణ గావించుటయే శ్రేష్టమగు సాధనమనినీకెఱుకపడగలదుకావున సంశయముల వీడి ప్రభాతముల నుండి రామచింతన గావింపుము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: