మనాచీ శ్లోకములు (76—80)

24 Jul

76.  నహ్వేకర్మ నా ధర్మ నా యోగకాంహీ 

         నహ్వేభోగ నా త్యాగ నా సంగపాహీ |

         హ్మణే దాస విశ్వాస నామీ ధరావా

         ప్రభాతే మనీ రామ చింతీతజావా  ||శ్రీరాం|| 

ఓమనసా! కలికాలకల్మషప్రభావముచే కర్మ,ధర్మ,యోగ,యాగ,భోగ ,త్యాగసాధనలెవ్వియును యధాశాస్త్రీయముగా మానవుడాచరింపజాలడు. నామస్మరణ మొక్కటియే సులభసాధ్యమగు  సాధనము . కావున భగవన్నామమందు సంపూర్ణవిశ్వాసముంచి ప్రభాతము నుండి శ్రీరామచింతన గావింపుము 

77.  కరీ కామ నిష్కామ యా రాఘవాచే

         కరీరూప స్వరూప సర్వాజివాంచే |

         కరీచంద నిర్ధ్వంద్వ హే గూణగాతాం

         హరీ కీర్తనీ  వృత్తి విశ్వాస హోతాం ||శ్రీరాం||

 ఓమనసా!  రాముని యందలి ప్రేమభక్తుని నిష్కామస్థితికి గొనిపోవును. శ్రీరాముని స్వరూపము ధ్యానించు భక్తునికివి శ్వమంతయు రామమమయముగా కనపడును. భగవత్కీర్తన యందు మనోవృత్తులు లయింపజేసి విశ్వాసముచే శ్రీరామగుణగానము గావించినచో భక్తుడు నిస్సంశయముగ నిర్ధ్వంద్వస్థితిని బొందగలడు. నారదభక్తిసూత్రములందు అట్టిభక్తుని విషయమైసిధ్ధోభవతి ,అమృతోభవతి,తృప్తోభవతి ,నకించిత్వాంఛతి,నశోచతి,నద్వేష్టి,నరంతేనోత్సాహేభవతియని చెప్పబడియున్నది

78.  అహోజ్యా నరా రామ విశ్వాస నాహీ

         తయా పామరా బాధిజే సర్వకాంహీ |

         మహారాజతో స్వామి కైవల్యదాతా

         వృథా వాహాణే దేహ సంసారచింతా  ||శ్రీరాం|| 

ఓమనసాఏమానవునికి రాముని యందు విశ్వాసములేదో అట్టిపామరునికే దేహబుధ్ధిచే సంసారదుఃఖములు సర్వకాలము బాధించుచున్నవి.కైవల్యమంతటిఫల మిచ్చుటకు సర్వసమర్థుడగు శ్రీరాముడుండ అట్టి రామునికై విశ్వాసముంచజాలక మానవుడు సంసారచింతల నిమగ్నుడగుట అతని దౌర్భాగ్యము 

79.   మనా పావనా భావనా రాఘవాచీ

          ధరీ అంతరీ సోడి చింతా భవాచీ

          భవాచీ జివా మానవా భూలిఠేలీ

          నసే వస్తుచీ ధారణా వ్యర్థగేలీ ||శ్రీరాం||  

ఓమనసపావనమగు రాఘవుని భావనయందే రమించుచు,సంసారపు చింతలను వదలుము,ప్రపంచ విషయములందు మానవుడు మోహితుడై సత్యవస్తుధ్యానము లేక జీవితమును వ్యర్థముగాగడిపి అంత్యకాలమున కష్టములపాలగుచున్నాడు. ఇట్లు గావింపక ఓమనసారాఘవుని నమ్మి జీవితముగడుపుము 

80.   ధరా శ్రీవరా త్యా హరాఅంతరాతే

           తరా దుస్తరా త్యాపరా సాగరాతే |

           సరావీ సరాత్యా భరా దుర్భరాతే

           కరా నీకరాత్యా ఖరా మత్సరాతే  ||శ్రీరాం||

 ఓమనసా ! పరమశివుని హృదయమున సర్వకాలమువసించెడి శ్రీరాముని ఆశ్రయింపుము, అట్లు గావించినచో దుస్తరమగుభవసాగరమును అవలీలగాదాటగలవు. ఉదరపోషణవృత్తుల గావించుచున్నను కొంతకాలమైనను  వాటినిమరచి  అంతర్ముఖుడవై  శ్రీరాముని ధ్యానింపుము .అతి  నీచమగు మత్సరగుణమును సర్వప్రయత్నముల నాశమొనరింపుము

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: