మనాచీ శ్లోకములు (81—85)

26 Jul

81.  మనా మత్సరే రామ సాండూ నక హో 

        అతీ ఆధరే హా నిజధ్యాస రాహో 

        సమస్తాం మధే నామహే సార  ఆహే 

       దుజీ తూళణా తూళీతాం హీ సాహే ||శ్రీ రాం||

 ఓ మనసా! దేవధర్మసజ్జన విషయమున సంశయగ్రస్థుడవై    నామస్మరణను త్యజింపబోకుము.అత్యాదరముచే నామస్మరణ గావింపుచుండుము.సర్వసాధనముల ఫలమే  నామస్మరణము.యజ్ఞయాగ తపోధికములు నామస్మరణకు సరిరావు.అట్టి రామ నామ స్మరణ నెల్లప్పుడు చేయుచుండుము. 

82.  బహూ నామ యా రామ నామీ తుళేనా

         అభాగ్యా నరా పామరా హే కళేనా |

         విషా ఔషధా ఘేతలే పార్వతీశే 

         జివా మానవా కింకరా కోణ పూసే ||శ్రీ రాం|| 

ఓ మనసా! సర్వనామ మంత్రములయందు రామనామ మత్యుత్తమమైనది.అభాగ్యులగు సామాన్యమానవులకీ విషయము గోచరింపదు. కాలకూతవిషమును లోక కల్యాణార్థము త్రాగిన పార్వతీపతి యట్టి విషపదార్థమును శమింపజేయు నౌషధమగు రామనామమృతమును సేవించుచుండ నల్పజ్ఞులును అల్పశక్తిమంతులునునగు  తుఛ్ఛ  మానవుల సంగతి విచారింప నేల ?

83.  జేణే జాళిళా కామ తో రామ ధ్యాతో

         ఉమేసీ అతీ ఆదరే  గూణ గాతో

         బహూ జ్ఞాన వైరాగ్య సామర్థ్య జేథే

         పరీ అంతరీ నామ విశ్వాస తేథే  ||శ్రీ రాం||

 ఓ మనసా! మన్మధుని జయింపగలిగిన వైరాగ్యనిధియగు శంకరుడు సైతము సర్వకాలము రామధ్యానము గావించుచు,అత్యాదరముచే పార్వతికి రామగుణానువాదము ఆధ్యాత్మ రామాయణ రూపమున దెలిపి యున్నాడు.విశ్వాసయుక్తమగు రామనామస్మరణ  చేయువారికి  జ్ఞానవైరాగ్య సామర్థ్యములు సులభముగ చేకూరగలవు.

84.  విఠోనే శిరీ వాహిలా దేవరాణా 

         తయా అంతరీ ధ్యాస రే త్యాస నేణా 

         నివాలా స్వయే తాపసీ చంద్రమౌళీ

         జివాం సోడవీ రామ హా అంతకాళీ ||శ్రీ రాం||

 ఓ మనసా !పండరిపురి యందుండు విఠ్ఠలుడు యే శంకరుని తన మస్తకముపై ప్రేమచే ధరించి యున్నాడో అట్టి శంకరుని హృదయమందు శ్రీరాముడఖండముగ వసించుచున్నాడు.శంకరుని హృదయమే శ్రీరామ నివాసస్థానమని తెలియకున్నావు.అట్టి శంకరుడే రామచింతనచే శాంతినొందియుండ అట్టి రాముని నీవేల భజింపవు? అంత్యకాలమున ప్రభుడగు శ్రీరాముడు తప్ప జీవదశ నుండి విడిపింప సమర్థుడు మఱిలేడు. 

 85.  భజా రామ విశ్రామ యోగేశ్వరాంచా  

          జపూ నేమిలా నేమ గౌరీహరాచా |

          స్వయే నీవవీ తాపసీ చంద్రమౌళీ 

          తుహ్మా  సోడవీ రామ హా అంతకాళీ ||శ్రీ రాం||

 ఓ మనసా ! యోగీశ్వరులకు సహితము విశ్రాంతి స్థానమగు రామచంద్రుని స్మరింపుము.పార్వతీ పరమేశ్వరులత్యంత భక్తితో నిరంతరము స్మరించు నట్టి రామనామస్మరణము గావించినచో  నంత్యకాలమున రామచంద్రుడు నిన్ను తప్పక జనన మరణములనుండి తప్పించి ముక్తిస్థానము జేర్చగలడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: