మనాచీ శ్లోకములు (85—90)

28 Jul

86.   ముఖీ రామ విశ్రామ తేథేచ ఆహే

         సదానంద ఆనంద సేవూని రాహే |

         తయావీణ తో సీణ సందేహకారీ

         నిజధామ హే నామ శోకాపహారీ ||శ్రీ రాం ||

 ఓ మనసా ! ఎవ్వని జిహ్వాగ్రమున రామ నామము తాండవించుచున్నదో  అట్టి వానికి  విశ్రాంతి సుఖమును పరమానందమును చేకూరును. రామనామ స్మరణలేని సర్వ సాధనములు కష్టప్రదములును,దుఃఖప్రదములును కాని సుఖ ప్రదములు గావు. సందేహవికల్పములు పోజాలవు. నామమే సర్వశోకాపహారియై ఆత్మ సుఖమును గలిగించుటకు సమర్థమై ఉన్నది .

 87.   ముఖీ రామ త్యా కామ బాధూం శకేనా

          గుణే ఇష్ట ధారిష్ట త్యాచే చుకేనా

          హరీ భక్త తో శక్త కామాస మారీ 

          జగీ ధన్య తో మారుతీ బ్రహ్మచారీ ||శ్రీ రాం||

 ఓ మనసా! ఎవ్వడు రామనామమును సేవించుచున్నాడో అట్టి వానికి కామబాధ గలుగజాలదు.అనేక సంకటములు గలిగినను వాని మనోధైర్యము  చలింపదు.భగవద్భక్తుడు అట్టి భక్తిచే బలవంతుడై అంతర్బాహ్య శత్రువుల జయింపగలుగుచున్నాడు.రామభక్తి చే ఎట్టి శక్తి గలుగునన్నది ధన్యుడగు మారుతి బలపరాక్రమములచే నెరుగుదును.  

88.   బహూ చాంగలే నామ యా రాఘవాచే

         అతీ సాజీరే స్వల్ప సోపే పుకాచే

         కరీ మూళ నిర్మూళ ఘేతాం భవాచే

         జివాం మానవాం హే చి కైవల్య సాచే ||శ్రీ రాం ||

 ఓ మనసా ! “రామ” యను రెండక్షరముల నామము మిక్కిలి సుందరముగను ,స్వలముగను ,మధురముగను శ్రమలేక పొందగలిగినదిగను ప్రకాశించుచున్నది. ఇట్లుండియు జన్మమూలమగు వాసనలు గాల్చివైచి భక్తులకు కైవల్య ధనమొసగునంతటి శక్తివంతమై ఉన్నది.

89.   జనీ భోజనీ నామ వాచే వదావే

         అతీ ఆదరే గద్య ఘోషే హ్మణావే

         హరీ చింతనే అన్న జేవీత జావే

         తరీ శ్రీహరీ పావిజేతో స్వభావే  ||శ్రీ రాం||

 ఓ మనసా ! భోజన సమయమున నామకీర్తన గావించుచు అత్యాదరముచే భగవంతుని లీలల గద్య పద్య రూపముల గర్జించుచు ,ఘోషించుచు హరిచింతనచే అన్నమును స్వీకరించుటచే భుజించెడి అన్నము పవిత్రమై భగవద్భక్తిని సంపాదింపగలదు. అట్టి భక్తిచే అనాయాసముగా శ్రీహరిని పొందగలవు.

 90.    న యే రామవాణీ తయా థోర హాణీ

           జనీ వ్యర్థ ప్రాణీ తయా నామ కాణీ |

           హరీనామ హే వేదశాస్త్రీ పురాణీ

           బహూ ఆగళే బోలిలీ వ్యాసవాణీ  ||శ్రీ రాం||

 ఓ మనసా! వేద శస్త్రములందును పురాణములందును హరి నామస్మరణమే శ్రేష్టతమ ధనమని వ్యాసుడు ఘోషించియుండ అట్టి నామస్మరణ గావింపని మానవుడు వ్యర్థ జీవితుడై దీనుడై ఘోర దుఃఖముల పాలుగావలసివచ్చును.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: