మనాచీ శ్లోకములు (96—100)

1 Aug

96. మహాం భక్త ప్రహ్లాద హా దైత్య కూళీ

        జపే రామనామవళీ నిత్యకాళీ |

        పితా పాప రూపీ తయా దేఖవేనా

        జనీ దైత్యతో నామ మూఖే హ్మణేనా ||శ్రీ రాం ||

మనసా ! దైత్య కులమునందు జన్మించిననూ మహాభక్తుడు ప్రహ్లాదుడు సర్వకాలము నందును రామనామమును జపించుచూ అనేకసంకటములనుండి విముక్తుడై యుండుట జగద్విదితము. అట్టి హరిభక్తి పరాయణుడైన ప్రహ్లాదుని తండ్రి హరినామమును జపింపక దైత్యుడై నాశనమొందెను.దైత్యకులమున బుట్టియు హరిస్మరణముచే ప్రహ్లాదుడు ఉధ్ధరింపబడెను.కావున నామస్మరణకు జాతిమత వివక్షతలు లేవు.

97.  ముఖీ నామ నాహీ తయా ముక్తి కైచీ

         అహంతాగుణే యాతనా తే పుకాచీ|

         పుఢే అంత యేయీల తో దైన్యవాణా 

         హ్మణోనీ హ్మణా రే హ్మణా దేవారాణా ||శ్రీ రాం||

మనసా ! భగన్నామస్మరణ గావింపని వారికి ముక్తి ఏల సంభవింపగలదు? అహంకారముచే కష్ట పరంపరల ననుభవించి దీనత్వమున వ్యర్థజీవితుడై మరణింపవలసి వచ్చును. కావున మనసా దేవశ్రేష్ఠుడైన శ్రీరాముని దివ్య నామమును స్మరణ గావించుచుండుము.

98  హరీనామనే మస్త పాషాణ తారీ

        బహూ తారిలే మానవా దేహధారీ

        తయా రామనామీ సదా జో వికల్పీ

        వదేనా కదా జీవ తో పాప రూపీ ||శ్రీ రాం||

మనసా ! రామనామముచే సముద్రమున పాషాణములే మునగక సేతురూపమున తేలియుండ దేహధారులగు మనవులు రామనామముచే భవసాగరమున మునగక రక్షింప బడుదురనుటలో నాశ్చర్యమేమున్నది.నామ మహిమ చే నెందరో భక్తులుధ్ధరింపబడి యున్నవారు. అట్టి రామనామమునందు సందేహము గలిగి సేవింపనివాడు జీవులలో పాపరూపియని చెప్పక తప్పదు.

99. జగీ ధన్య వారాణసీ పుణ్యరాసీ

        తయేమాజిం జాతాం గతీ పూర్వజాంసీ |

        ముఖే రామ నామావళీ నిత్య కాళీ

        జివా హీత సాంగే సదా చంద్రమౌళీ ||శ్రీ రాం||

మనసా ! కాశీక్షేత్రము పవిత్రక్షేత్రమై అట్టి క్షేత్రమున మరణించు వారికి సద్గతులు గల్గుటయే గాక అట్టివారి పూర్వీకులు కూడ నుధ్ధరింపబడుదురు. కాశిక్షేత్రమునకట్టి మహిమ గల్గుటకు కారణ మేమన క్షేత్రమున సర్వకాలము విశ్వనాధుడు రామనామమును జపించుచు ,క్షేత్రమున మరణించువారికి రామనమము నుపదేశించుచుండుటయే .

100.  యేధాసంగ రే కర్మ తేహీ ఘడేనా

            ఘడే కర్మ తే పుణ్య గాంఠీ పడెనా |

            దయా పాహతాం సర్వభూతీం అసేనా

            పుకాచే ముఖీ నామ తేహీ వసేనా ||శ్రీ రాం||

మనసా !కలిప్రభావముచేత మానవులు యధా శాస్త్రీయముగ కర్మాచరణ నాచరింపజాలకున్నారు. ఎచ్చటనైన ధర్మకార్యములు జరిగినను అవి ఫలాపేక్ష చే చేయబడుటచే పుణ్యప్రదములు గాకున్నవి.భూతమాత్రములయందు మానవులు దయా స్వభావము జూపజాలకున్నారు .కట్టకడపటికి అతిసులభముగ జేయగలిగెడి నామస్మరణకూడ చేయజాలకున్నారు .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: