మనాచీ శ్లోకములు (106—110)

8 Aug

106.   బరీ స్నానసంధ్యా కరీ ఏకనిష్ఠా

           వివేకే మనా ఆవరీ స్థానభ్రష్టా 

           దయా సర్వ భూతీ జయా మానవలా

           సదా ప్రేమళూ భక్తి భావే నివాలా ||శ్రీ రాం ||

 మనసా ! స్నాన సంధ్యాది స్వధర్మకర్మలను ఏక నిష్ఠ చే గావించుచు బ్రహ్మపద భ్రష్టమగు మనమును బ్రహ్మాభిముఖము గావించి నిగ్రహింపుము.సర్వభూతముల యందు దయాస్వభావము కలిగియున్నచో శీఘ్రమున అట్టి భూతప్రేమచే భగవద్భక్తి సులభముగ బొంది శాంతి  సమాధానముల బొందగలవు.

107.    మనా కోప-ఆరోపణాతే నసావీ

            మనా బుధ్ధి హే సాధుసంగీ వసావీ

            మనా నష్ట చాండాళ తో సంగ త్యాగీ

            మనా హోయిం  రే మోక్షభాగీ విభాగీ ||శ్రీ రాం||

 మనసా! సర్వప్రయత్నములు గావించి కోపమునకు చోటివ్వకుము.సాధు సజ్జన సంగత్యముచేతను,దుష్టులను, చండాల పాషండుల సంగము వర్జించుట చేతను మోక్షమార్గము ననుగమించుటకు అధికారము సంపదించగలవు.దుర్జన సాంగత్యము పరమర్థ సాధకునకు మిక్కిలి హానికరమని భావము .

 108.    సదా సర్వదా సజ్జనాచేని యోగే 

             క్రియా పాలటే భక్తి భావార్ధ లాగే |

             క్రియేవీణ వాచాళతా తే నివారీ

             తుటే వాద సంవాద తో హీతకారీ ||శ్రీ రాం||

 మనసా! సజ్జన సాంగత్య మహాత్య మెంతని వర్ణింపగలను. అట్టి సాంగత్యముచే భక్తి భావమంకురించి  దుష్కార్యములు మాని సత్ క్రియాచరణను మానవుడు ప్రారంభించును.క్రియాచరణ లేని  వాగాడంబరము వ్యర్థము. సమాధాన రూపమున పరిణామమొందెడి వాదమే హితకరమైన సంవాదము.

109.   జనీ వాద వేవాద సోడూని ధ్యావా

           జనీ సూఖసంవాద సూఖే కరావా |

           జగీ తో చి తో శోకసంతాపహారీ

           తుటే వాద సంవద తో హీతకారీ  ||శ్రీ రాం||

  మనసా! అభిమానగ్రస్తమగు వాద వివాదములు మాని ,శోకసంతాపములు పోగొట్టి సుఖము సమధానము  జేకూర్చెడి సంవాదమునే గావింపుము.

110.   తుటే వాద సంవాద త్యాతే హ్మణావే 

          వివేకే అహంభావ యాతే జిణావే |

          అహంతాగుణే  వాద నానావికారీ

          తుటే వాద సంవద తో హీతకారీ  ||శ్రీ రాం||

  మనసా! వాదవివాదమంత్యమై  సుఖసమధాన రూపమున పరిణామమొందునదే  సంవాదమనబడును.వాద వివాదములకు అహంకారమే కారణము .  కావున అట్టి అహంకార గ్రస్తమగు వాదము అనేక వికారములను గలిగించును .గాన అట్టి అహంకారమును మాని సత్యాన్వేషణమునకై   పెద్దల చెంత సంవాదము గావింపుము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: