మనాచీ శ్లోకములు (116—120)

13 Aug

116.   బహూ శ్రాపితాం కష్టలా అంబఋషీ

          తయాచే స్వయే శ్రీహరీ జన్మ సోశీ |

          దిహ్లా క్షీరసింధూ తయా ఊపమానీ

          నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! విష్ణు భక్తుడైన అంబరీషుడు దుర్వాసునిచే మిగుల కష్ట పెట్టబడిన వాడై శ్రీహరిని ప్రార్థింప భగవంతుడు చక్రరూపియై యంబరీషుని,దుర్వాసుని బారి నుండి రక్షించెను.ఉపమన్యు బాలునికి క్షీర సంకట మును బావుటకై క్షీరసంద్రమునే యతని కిచ్చిన భగవంతుడు భక్తుల నెన్నటికిని యుపేక్షించువాడు కాడు.

 117.    ధరూ లేకరూం బాపుడే దైన్యవాణే

            కృపా భాకితా దీధలీ దైన్యజేణే |

            చిరంజీవ తారంగణి ప్రేమఖాణీ

            నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! సవతి తల్లిచే నవమానింపబడి దీనుడై యనాధుడైన ధ్రువబాలకుని మొరాలించి ప్రసన్నుడై ధ్రువపదమును నిశ్చలపదము నాబాలకున  కొసంగిన భగవంతుడు తన భక్తుల నుపేక్షించువాడు కాడు.

118.    గజేంద్రూ మహాం సంకటీ వాట పాహే

           తయాకారణే శ్రీహరీ ధాంవతాహే |

           ఉడీ ఘాతలీ జాహలా జీవదానీ

           నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! గజేంద్రుడు మొసలిచే బట్టుబడి ప్రాణసంకట  సమయ మందుండెడి వేళ దీనుడై శ్రీహరిని బ్రార్థింప నతనికి కుయ్యాలించి  సత్వరమున చక్రముచే మొసలిని ఖండించి గజేంద్రునికి ప్రాణదానమొసగిన భగవంతుడు నిజ భక్తుల నెన్నటికిని మరుచువాడు కాడు .

119.    అజామేళ పాపీ తయా అంత ఆలా

           కృపాళూపణే తో జనీ ముక్త కేలా |

           అనాథాసి ఆధార హా చక్రపాణి

           నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! సర్వ పాపాల కారకుడైన దురాచారుడైన అజామీళుడంత్య  కాలమున పుత్రుని బిలిచెడి మిష చే “నారాయణా” యని బ్రార్థింప, నతనికి వైకుంఠపదమిచ్చిన భగవంతుడు అనన్యులగు భక్తులనుపేక్షించువాడు కాడు.

120.    విధీకారణే  జాహలా మత్స్య వేగీ

            ధరీ కూర్మరూపే ధరా పుష్ఠభాగీ |

            జనా రక్షణాకారణే నీచ యోనీ

            నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! రాక్షసునిచే గొనిపోబడిన వేదములను మరల బ్రహ్మదేవుని కిచ్చుటకై మత్స్యావతారము దాల్చిన భగవంతుడు,భూభారమును వీపున ధరించుటకై కూర్మావతారమెత్తిన భగవంతుడు, లోకకళ్యాణము కొరకై వరహాది నీచ యోనుల నవతరించిన భగవంతుడు భక్తుల నేమరువాడు కాడు. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: