మనాచీ శ్లోకములు (121—125)

15 Aug

121.   మహాభక్త ప్రహ్లాద హా కష్ట వీలా 

          హ్మణోనీ తయ కారణే సింహ జాలా |

          న యే జ్వాళ వీషాళ సంనీధ కోహ్ణీ  

          నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా | క్రూరుడగు హిరణ్య కశిపునిచే హింసింపబడిన ప్రహ్లాద భక్తుని సంరక్షించుటకై భయంకరమగు నరసింహరూపమును దాల్చిన భగవంతుడు  భక్తుల నుపేక్షించుట కలలోని వార్త.

122.   కృపా భాకితా జాహలా వజ్రపాణిం

           తయా కారణే వామనూ చక్రపాణిం |

           ద్విజా కారణే భార్గవూ  చాపపాణి

           నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! ఇంద్రుడు దీనుడై ప్రార్థింప దేవకార్యమును దీర్చుకొరకు  బలి చక్రవర్తి కొరకు వామనుడై జన్మించిన భగవంతుడు, బ్రాహ్మణులను హింసించెడి రాజుల గర్వమడంచుటకై పరశు రామావతారము దాల్చిన భగవంతుడు దాసజనుల నుపేక్షించు వాడు కాడు.

123.    అహిలే సతీలాగి అరణ్యపంథే 

            కుడావా పుఢే దేవ బంధీ తయాతే |

            బళే సోడితాం ఘావ ఘాలీ నిశాణీ

            నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం|| 

 మనసా! శాపగ్రస్తయై పాషాణమై పడియుండెడి యహల్య నుధ్ధరించి, రావణుని బంధిశాలయందు బడియుండిన దేవతల నుధ్ధరించుటకునై రణభేరి మ్రోగించి వెడ్వెడలిన శ్రీరాముడు,తనదాసజనులనెన్నటికి కైనను ఉపేక్షజేయునా?

124. తయే ద్రౌపదీకారణే లాగ వేగే

         త్వరే ధాంవతూ  సర్వ సాండూని మాగే |

         కళీలాగి జాలా అసే భౌధ్య మౌనీ

         నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! కౌరవ సభయందు సంకట సమయమందుండెడి వేళను, దుర్వాసుడు పాండవుల చెంతకు అకాలమున నతిధియై వచ్చి పరీక్షించెడి వేళను ద్రౌపదిని సంరక్షించిన భగవంతుడు, కలియుగమున మానవులచే నల్పకాలమున ప్రారబ్ధ కర్మ[హలముల ననుభవింపజేసి జ్ఞానోదయ మొనరించుటకునై బుధ్ధావతరము దాల్చిన భగవంతుడు భక్తులనుపేక్షింపడు.

125.   అనాథాం దినాకారణే జన్మతాహే

           కలంకీ పుఢే దేవ హోణార ఆహే|

           జయా వర్ణితాం సీణలీ వేదవాణీ

           నుపేక్షీ కదా దేవ భక్తాభిమానీ ||శ్రీ రాం||

 మనసా! దిక్కులేని దీన జన సంరక్షణకై యవతరించెడి భగవంతుడు భావికాలమున కల్కి అవతారమును  గైకొనబోవుచున్నాడు. వేదము వర్ణింపజాలలేకపోయిన,మహిమగల భగవంతుడు తన భక్తుల నుపేక్షించువాడు కాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: