మనాచీ శ్లోకములు (126—130)

17 Aug

126.     జనాకారణే దేవ లీలావతారీ

            బహూతాంపరీ ఆదరే వేషధారీ |

            తయా నేణతీ తే జన పాపరూపీ

            దురాత్మే మహాం నష్ట చాండాళ పాపీ ||శ్రీ రాం||

 మనసా! లోక కల్యాణమునకై యనేక లీలావతారము లెత్తెడి భగవంతుడు  అనేక సమయముల ననేకవేషముల ధరించుచున్నాడు.అట్టి భగవంతుని తెలుసుకోలేని వాడే  పాపియును , దురాత్ముడును,చండాలుడగుచున్నాడు .

127.    జగీ ధన్యతో రామసూఖే నివాలా

           కథా ఏకతాం సర్వ తల్లీన జాలా |

           దేహేభావనా రామబోథే ఉడాలీ

           మనోవాసనా రామ రూపీ బుడాలీ ||శ్రీ రాం||

 ఓమనసా! ఎవ్వడు రామనామామృత సుఖముచే నానంద సమాధానముల నొందియున్నాడో,రామగుణానువాదము శ్రవణము జేసిన తోడనే ఎవ్వడు తన్మయుడగుచున్నాడో,ఎవ్వడు రామతత్వ బోధితుడై దేహబుధ్ధుల మరచియున్నాడో, ఎవ్వడు తనమనః  ప్రవృత్తులన్నియు రామరూపమున లీనముగావించి యున్నాడో అట్టి వాడే మానవకోటిలో ధన్యుడు.

128.    మనా వాసనే వాసుదేవీ వసో దే

           మనా కామనా కామసంగీ నసో దే |

           మనా కల్పనా వావుగీ తే కీజే

           మనా సజ్జనా సజ్జనీ వస్తి కీజే ||శ్రీ రాం||

 మనసా! నీవాసనలన్నియునువాసుదేవుని యందు లక్ష్యము గావించి విషయకామనలకు దాసుడవు గాక,వ్యర్థ కల్పనల జేయకుండెడి యాసక్తి గలచో నెల్లప్పుడు సజ్జనసాంగత్యమున రమించుచుండుము.

129.    గతీకారణే సంగతీ సజ్జనాచీ

           మతీ పాలటే సూమతీ దుర్జనాచీ  |

           రతీనాయికేచా పతీ నష్ట ఆహే

           హ్మణోనీ మనాతీత హోవూని రాహే ||శ్రీ రాం||

 మనసా! భావికులగు వారికి సజ్జనసాంగత్యము సద్గతులు కలిగించును దుర్జనులుసయితము సజ్జన సాంగత్యముచే దుష్ట ప్రవృత్తులమాని బ్రవేశింతురు.విషయసేవననునెడి (రతికి) మనోజాతుడు (కాముకుడే) భర్త కావున మనాతీత స్థితియందు రమింప బ్రయత్నింపుము.

 130.    మనా అల్ప సంకల్ప తోహీ నసావా

             సదా సత్య సంకల్ప చిత్తీ వసావా |

             జనీ జల్ప వీకల్ప తోహీ త్యజావా

             రమాకాంత ఏకాంతకాళీ భజావా ||శ్రీ రాం||

 మనసా ! తుచ్ఛమగు మిధ్యారూపములగు మాయా కల్పనలను వదిలి, సత్యమగు బ్రహ్మ విషయకమగు సంకల్పములే గావించుచు జనసంసర్గమున తర్క వితర్క వాదముల గావింపక,ఏకాంతమున రమాకాంతుడగు శ్రీ రాముని యందు నిండు భక్తి చే ధ్యానించుచుండుము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: