మనాచీ శ్లోకములు (131—135)

19 Aug

131.   భజాయా జనీ పాహాతాం రామా ఏకూ

           కరీ బాణా ఏకూ  ముఖీ శబ్ద ఏకూ  |

           క్రియా పాహతాం ఉధ్ధరే సర్వ లోకూ

           ధరా జానకీ నాయకాచా వివేకూ ||శ్రీ రాం||

 మనసా ! భజనీయులగు దైవతములలో శ్రీ రాముడె ఉత్తమోత్తముడు.అతడు సత్య ప్రతిజ్ఞుడును, ఏక పత్నీవ్రతుడును, ఏక బాణుడైన జగత్ప్రసిధ్ధుడు . అట్టి రాముని దివ చరిత్రము పవిత్రమై లోకమునుధ్ధరింప సమర్ధమై యున్నది. కావున నట్టి శ్రీరాముని ధ్యానించి ధన్యుడవు గమ్ము.

132.  విచారూని బోలే వివంచూని చాలే

          తయాచేని సంతప్త తేహీ నివాలే |

          బరే శోధిల్యావీణ బోలో నకో హో

          జనీ చాలణే శుధ్ద నేమస్త రాహో ||శ్రీ రాం||

 మనసా ! “విచార” యుక్త సంభాషణమును, తదనుగుణమగు జీవిత వర్తన క్రమము గల పురుషుల సాంగత్యముచే పరితప్తులగు జీవులు శాంతినొందుచున్నారు . వివేకవిచార యుక్తుడవై సంభాషింపుము. పరిశుధ్ధమును నియమబధ్ధమగు జీవితక్రమమున సాధింపుము.

133.   హరీభక్త  వీరక్త విజ్ఞాన రాశీ 

           జేణే మానసీ స్థాపిలే నిశ్చయాసీ |

           తయా దర్శనే స్పర్శనే పుణ్య జోడే

           తయా భాషణే నష్ట సందేహ మోడే ||శ్రీ రాం||

 మనసా! ఎవ్వడు భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడో, ఎవ్వడు దేహబుధ్ధులను వదలి ఆత్మనిశ్చయారూఢుడై ఉన్నాడో,అట్టివాని దర్శన స్పర్శన సంభాషణాదులచే మనుజులు పవిత్రులై సందేహరహితులై నిశ్చయ జ్ఞానము బొందుచున్నారు .

134.   నసే గర్వ అంగీ సదా వీతరాగీ 

           క్షమాశాంతి భోగీ దయా దక్ష యోగీ |

           నసే లోభ నా క్షోభ నా దైన్య వాణా

           ఇంహీ  లక్షణే జాణిజే యోగిరాణా ||శ్రీ రాం||

 మనసా ! గర్వ రహితుడును , వైరాగ్య సంపన్నుడును, క్షమ శాంతి దయా చాతుర్య గుణములు గలిగి , లోభమునకు దాసుడు గాక, మనక్షోభము దీనత్వము లేక యుండువాడే యోగీశ్వరుడని చెప్పబడును.   

135.    ధరీ రే మనా సంగతీ సజ్జనాచీ

            జేణె వృత్తి హే పాలటే దుర్జనాచీ |

            బళే భావ  సద్బుధ్ధి సన్మార్గ లాగే 

            మహాం కౄర తో కాళ విక్రాళ ఆహే  ||శ్రీ రాం||

 మనసా ! సజ్జన సాంగత్యముచే దుర్జనులు కూడా తమ దుర్మార్గ ప్రవృత్తులు మాని సన్మార్గమును అవలంబించెదరు. అప్రయత్నముగ నట్టి భాగ్యము  దుర్జనులకు గల్గును . సన్మార్గగాములగుటచే దుర్జనులు  యమ బాధలనుండి విముక్తులై సజ్జనుల వలెనే  నిర్భయస్థితి బొందగలరు .  కావున సర్వప్రయత్నముల గావించి సజ్జన సాంగత్యమును సంపాదించుకొనుము. 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: