మనాచీ శ్లోకములు (141—145)

23 Aug

141.   హ్మణే దాస సాయాస త్యాచే కరావే

          జణీ జాణతా పాయ త్యాచే ధరావే |

          గురు-అంజనేవీణ తే అకళేణా

          జునే ఠేవణే మీపణే తే కళేణా || శ్రీ రాం ||

 మనసా! అట్టి ఆత్మధనమును బొందుటకై సర్వప్రయత్నములు గావించి,ఆత్మానుభవము గల పెద్దల పాదములాశ్రయింపుము. గురుకటాక్షమనెడి అంజనము లేకుండా  గుప్తమగు  ఆత్మధనము లభింపజాలదు.

142.  కళేనా కళేనా కళేనా ఢళేనా

          ఢళే నాఢళే సంశయోహి ఢళేనా

          గళేనా గళేనా అహంతా గళేనా

          బళే ఆకళేనా మిళేనా మిళేనా || శ్రీ రాం ||

 మనసా! సద్గురు సహాయము లేనిచో ఆత్మధనము గోచరింపదు, సంశయములు వీడవు,అహంకారము వదులుట లేదు. బలవత్ప్రయత్నముల సాధింపనసాధ్యమని ముమ్మటికి నొక్కి చెప్పుచున్నాడను. 

143.  అవిద్యా గుణే మానవా ఊమజేనా

          భ్రమే చూకలే హీత తే ఆకళేనా |

          పరీక్షేవిణె బాంధిలే ధృఢ నాణే

          పరీ సత్య మిధ్యా  అసె కోణ జాణే || శ్రీ రాం ||

 మనసా! అజ్ఞానముచే బధ్ధులగు మానవులకు ఎంత బోధించినను,జ్ఞానప్రకాశము గలుగజాలదు. అజ్ఞాన జనిత భ్రమలకు లోనై  ఆత్మహితమును తెలుసుకొనజాలరు. చక్కగ పరిరక్షింప నేర మూఢుడు మూట గట్టికొనిన చెల్లని నాణెములెట్లు వస్తు విక్రయము నకుపయోగింపవో అట్టులే పామరుని మిథ్యా జ్ఞానములు ఆత్మానుభవమున కుపకరింపజాలవు .

144.  జగీ పాహతాం సాచ తే కాయ ఆహే

           అతీ ఆదరే సత్య సోధూని పాహే |

           పుఢే పాహతాం పాహతాం దేవ జోడే

           భ్రమ భ్రాంతి అజ్ఞాన హే సర్వ మోడే || శ్రీ రాం ||

 మనసా! జగత్తు యందు సత్యవస్తువు యెద్ది అని ఆదర పూర్వకముగా శోధించినచో  క్రమమముగ భగవత్సాన్నిధ్యము బొంది ,భ్రమ భ్రాంతి అజ్ఞాన ములన్నియు నీరసింపగలవు.

 145.  సదావీషయో చింతితాం జీవ జాలా

            అహంభావ అజ్ఞాన జన్మాసి ఆలా |

            వివేకే సదా సస్వరూపీ భరావే

            జివా ఊగమీ జన్మ నాహీ స్వభావే || శ్రీ రాం ||

 మనసా! జీవుడు నిజమునకు బ్రహ్మ స్వరూపుడయ్యును ఎల్లకాలము విషయ చింతన గావించుటచే వాసనా ప్రాబల్యముచే జనన మరణ స్వభావుడగు జీవుడగుచున్నాడు. వివేకముచే బ్రహ్మచింతన గావించునెడల నవలీలగ జన్మ రాహిత్యమగు పదమును బొందుచున్నాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: