మనాచీ శ్లోకములు (151—155)

28 Aug

151.  ఖరే శోధితాం శోధితాం  శోధతాహే

         మనా బోధితాం బోధితాం  బోధతాహే |

         పరీ సర్వహీ సజ్జనాచేని యోగే

         బరా నిశ్చయో పావిజే సానురాగే ||శ్రీ రాం||

 మనసా! అట్టి పరబ్రహ్మను శోధింప తప్పక దొరుకుట నిశ్చయము.మనస్సుకు క్రమముగ బోధగావించుటచే అట్టి వస్తు స్ఫురణ తప్పక కలుగును. అయితే పై చెప్పబడిన బోధలును,శోధనలును సజ్జన సాంగత్యమును లేనిదే ఫలింప జాలవు.కావున సద్గురు పదముల ప్రేమ యుక్తుడై భజించు మానవుడు పరబ్రహ్మ సుఖమును బొందగలడు.

152.  బహూతాం పరీ కూసరీ తత్వఝాడా

          పరీ పాహిజే అంతరి తో నివాడా |

          మనా సారా సాచార తే వేగళే రే

          సమస్తాంమధే  ఏక తే ఆగళే రే ||శ్రీ రాం||

 మనసా ! లౌకిక జ్ఞాన కుశలత్వముండినను,వేదాంత తత్వ విభాగదక్షత యుండినను,అంతరంగమున అట్టి జ్ఞాన పరిణామము లేనిచో,జ్ఞాన ముండినను లేని దానితో సమానమే.సర్వ ప్రపంచమందు నిండియుండి ప్రపంచాతీతమగు బ్రహ్మానుభవము గలిగించు జ్ఞానమేజ్ఞానము.

153.   నహ్వే పిండజ్ఞానే నహ్వే తత్వజ్ఞానే 

           సమాధాన కాంహి నహ్వే తానమానే |

           నహ్వే యోగయాగే నహ్వే భోగత్యాగే

           సమధాన తే సజ్జనాచేని యోగే  ||శ్రీ రాం|| 

 మనసా! పిండజ్ఞానముచే గాని తత్వజ్ఞానముచేగాని గానవిద్య మొదలగు లలితకళాభ్యాసముచే గాని అష్టాంగ యోగములచే గాని, బాహ్య విషయభోగత్యాగముచే గాని పొందజాలని యాత్మ సమాధానము కేవల సజ్జన సహవాసముచే లభింపగలదు.

154.  మహావాక్య తత్వాదికే పంచికర్ణే

          ఖుణే పావిజే సంతసంగే వివర్ణే  |

          ద్వితీయేసి సంకేత జో దావిజేతో

          తయా సాండునీ చంద్రమా భావిజేతో  ||శ్రీ రాం||  

 మనసా! మహావాక్య తత్వవిచార, పంచీకరణ వ్యాఖ్యానము సజ్జనులచెంత శ్రవణముగావించి బ్రహ్మానుభవమును బొందుము.అట్టి శ్రవణము గావించుము మనమున నిధిధ్యాసలు సాధించినచో బ్రహ్మరూపుడవు కాగలవు. చంద్రుని జూచినవాడు (సద్గురువు) చూడనివానికి (శిష్యునికి) శాఖాచంద్రన్యాయమున చంద్రుని జూపునట్లు మహావాక్యాది తత్వవివరణలచే సద్గురుడు శిష్యునకు బ్రహ్మను భవరహస్యమును దెల్పుచున్నాడు.

155.  దిసేనా జనీ తేచి శోధూని పాహే

         బరే పాహతాం గూజ తేధే చి ఆహే |

         కరీ ఘేవూన జాతాం కదా ఆడళేనా

         జనీ సర్వ కోందాటలే తే కళేనా ||శ్రీ రాం||  

 ఓ మనసా! స్థూలదృష్టికి గోచరింపక యుండెడి యాత్మపదార్థమును శోధించి కనుగొనుము.అట్లు శోధించినదో దృశ్య ప్రపంచము నందే యాత్మను కనుగొనగలవు.విశ్వమంతయు నిండి నిబిడీకృతమై యుండెడి అట్టి వస్తువు చేతికి దొరుకుట లేదుగాన సాధకుడై దీక్షతో ప్రయత్నించువానికి లభ్యమగును. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: