Tag Archives: సగూణీ అతి ఆదరేసీ భజావే

మనాచీ శ్లోకములు (101—105)

4 Aug

101.   జయా నావడే నామ త్యా యేమ జాచీ

          వికల్పే ఉఠే తర్క త్యా నర్క చీ చీ |

          హ్మణోని అతీ ఆదరే నామధ్యావే 

          ముఖే బోలతాం దోష జాతీ స్వభావే ||శ్రీ రాం||

 మనసా! ఎవనికి హరినామ స్మరణము రుచించుట లేదో అట్టివాడు మరణానంతరము మిక్కిలి యమబాధలననుభవింపవలసి వచ్చును. నామస్మరణమందు సందేహ వికల్పములు గావించువాడు తప్పక దీనుడై నరక దుఃఖములనుభవింపవలసి వచ్చును అందుచేత నో మనసా! అత్యాదరమున నామస్మరణ గావించుచు నవలీలగా దోషముల నుండి విముక్తుడవుగమ్ము. 

 102.    అతీ లీనతా సర్వభావే స్వభావే

             జనా సజ్జనాలాగిం సంతోషవావే |

             దెహే కారణీ సర్వ లావీత జావే

             సగూణీ అతి ఆదరేసీ భజావే  ||శ్రీ రాం||

 మనసా! ప్రాణి మాత్రముల యెడ నమ్రభావమున వర్తింపుము.సాధు సజ్జనుల సంతోష పెట్టుచుండుము.దేహము భగవత్సేవయందును,భూతసేవయందును,ఖర్చు పెట్టుచుండుము.అత్యాదరమున నఖండముగ సగుణోపాసనము గావించు చుండుము.

103.    హరీకీర్తనే ప్రీతి రామీ ధరావీ

            దెహేబుధ్ధి  నీరుపణీ వీసరావీ |

            పరద్రవ్య ఆణీక కాంతా పరావీ

            యదర్థీ మనా సాండి జివీ కరావీ ||శ్రీ రాం||

 మనసా! హరికీర్తన గావించెడి వేళలందు రాముని యెడ నిండు ప్రేమను వహింపుము.శ్రవణ ప్రసంగములందు ఏకాగ్రచిత్తుడవై దేహబుధ్ధిని వదులుము పరద్రవ్య పరకాంత విషయముల సంపూర్ణముగ త్యాగము గావింపుము ఇట్లు త్యాగము గావింపనిచో సగుణో పాసనయు శ్రవణమును వ్యర్థము కాగలవు.

 104.    క్రియేవీణ నానాపరీ బోలిజేతే

             పరీ చీత దుశ్చిత తే లాజవీతే |

             మనా కల్పనా ధీట సైరాట ధావే

             తయా మానవా దేవ కైసేని పావే ||శ్రీ రాం||

 మనసా! క్రియాచరణ శూన్యుడై కెవలం వాగాడంబరమున వాని చిత్తమతి  చంచలమై లోకమున వానిని  లోకమందు నవ్వులపాలు చేయును.మనోనియమములేక ఇచ్చ వచ్చినట్లు కల్పనలు చేయువానికి భగవంతుడెట్లు దొరుకగలడు ?

 105.   వివేకే క్రియా ఆపులీ పాలటావీ

            అతీ ఆదరే శుధ్ధ క్రీయా ధరావీ |

            జనీ బోలణ్యాసారిఖే చాల బాపా

            మనా కల్పనా సోడి సంసారతాపా ||శ్రీ రాం||

 మనసా! వివేకముచే నీ యందలి దోషగుణముల పోగొట్టుకొని శుధ్ధక్రియలనే అత్యాదరమున గావించుచు చెప్పెడి మాట చొప్పున సద్వర్తనములవలననవలంబిచుచు సంసార విషయమగు దుఃఖకల్పనలను మానుము.